
నటుడు విజయ్‌తో సమంత ఢీకొన పోతున్నారా? అవుననే చర్చ కోలీవుడ్‌లో జరుగుతుంది. కోలీవుడ్‌లో విజయ్‌కు ఉన్న స్టార్‌డం అంతా ఇంతా కాదు. ఆయన చిత్రాలు జయాపజయాలకు అతీతంగా కలెక్షన్లు కొల్లగొడతాయి. ప్రస్తుతం ఈయన టాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న వారీసు(తెలుగులో వారసుడు) చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే.
చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
మరో విషయం ఏమిటంటే ఇందులో నటి సమంత నటించనున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు తెరి, మెర్సల్, కత్తి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా నటి సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత చాలా బోల్డ్ పాత్రల్లో నటించడానికి సై అంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె పుష్ప చిత్రం కోసం చేసిన స్పెషల్ సాంగ్ కుర్రకారును గిలిగింతలు పెట్టే విషయం తెలిసిందే. ప్రస్తుతం శకుంతలం, యశోద వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. అలాంటిది విజయ్ 66 చిత్రంలో ఆయన్ని ఢీకొనే ప్రతినాయకి పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment