
సాక్షి, చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆయన నటించిన 'మెర్సల్' చిత్రానికి మద్దతు ఇచ్చిన అందరికీ విజయ్ కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సినిమా విజయం సాధించడం తనకు బలాన్ని ఇచ్చిందని తెలిపారు. మీ అందరి సహకారం తనను ఇంకా ముందుకు నడిపిస్తుందని వ్యాఖ్యానించారు. జీఎస్టీపై కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో విజయ్ నటించి మెర్సల్ చిత్రం వివాదాల్లోకి వెళ్లిన సంగతి తెల్సిందే.
కాగా ఈ చిత్రం విడుదలకు ముందు సంచలనాలు, అనంతరం ప్రకంపనలు పుట్టిస్తోంది. చిత్రంలోని ఓ సన్నివేశంలో జీఎస్టీ, వైద్య విద్యావిధానంపై సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు, వైద్యులు మండిపడిన సంగతి తెలిసిందే. అభ్యంతరకర మాటలు, సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు చిత్ర నిర్మాత సమ్మతించినా పరిస్థితి చేయి దాటి వివాదం రాజకీయ రంగు పులుముకుని రచ్చరచ్చగా మారింది. అయితే చిత్ర పరిశ్రమతో పాటు బీజేపీయేతర రాజకీయ పార్టీలు మెర్శల్‌కు అండగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment