Vijay And Nelson's Thalapathy 65 Titled 'Beast', First Look Poster Revealed - Sakshi
Sakshi News home page

దళపతి విజయ్‌ బర్త్‌డే: Thalapathy 65 ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Published Mon, Jun 21 2021 7:15 PM | Last Updated on Mon, Jun 21 2021 8:26 PM

Thalapathy 65 Movie First Look Launch On Vijay Birthday June 22 - Sakshi

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ పుట్టిన రోజు(జూన్‌ 22) సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఈ రోజు రానున్నట్లు సన్‌పిక్చర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే తాజాగా సన్‌ పిక్చర్స్‌ సోమవారం (జూన్‌ 21) సాయంత్రం 6 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. దీంతో విజయ్‌ కొత్తమూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ మూవీ టైటిల్‌ను ‘బీస్ట్‌’గా ఖారారు చేశారు. బీస్ట్‌ అని ఇంగ్లిష్‌లో రాసి ఉన్న ఈ పోస్టర్‌లో విజయ్‌ తుపాకి పట్టుకుని కనిపించాడు. ఇందులో విజయ్‌ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. దీంతో విజయ్‌ ఈ లుక్‌ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ నెల్సన్‌  ట్వీట్‌ చేస్తూ.. ‘నా ఫేవరేట్‌ హీరో దళపతి కొత్త మూవీ ఫస్ట్‌లుక్‌ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ సన్‌పిక్చర్స్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరూధ్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

అంతేగాక ఈ సందర్భంగా హీరో విజయ్‌కి బర్త్‌డే విషెష్‌ కూడా తెలిపాడు. కాగా ఈ చిత్రంలో విజయ్‌​​ సరసన బుట్ట బోమ్మ పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాతోనే పూజా హెగ్డే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. నెల్సన్‌ డైరెక్షన్‌లో రూపోందుతున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌ త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇప్పటికే కథను సిద్ధం చేసిన వంశీ.. త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement