
సాక్షి, చెన్నై: హీరో విజయ్‌ను స్టార్ చేసింది తామేనని ప్రముఖ ఎగ్జిబిటర్ అభిరామినామనాథన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఆరమ్ తిణై చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న అభిరామినామనాథన్ ప్రసంగించారు. అనంతరం ఇదే వేదికపై దివంగత అబ్దుల్ కలాం సలహాదారుడు పొన్‌రామ్ మాట్లాడుతూ.. థియేటర్ల యాజమాన్యం చిన్న చిత్రాలను కొల్లగొడుతున్నారని ఆరోపణలు చేశారన్నారు. తాను ఈ ఏడాది 50 చిత్రాలను ఎగ్జిబ్యూషన్ చేశానని ఆయన అన్నారు.
వాటిలో 45 చిన్న చిత్రాలేనని తెలిపారు. ఒక్కోసారి థియేటర్‌లో ఐదారుగురు ప్రేక్షకులు కూడా ఉండరని, అలాంటప్పుడు తమకు ఏసీ ఖర్చు కూడా రాదని అలాంటి చిత్రాలను నిలిపేయకుండా ఎలా ప్రదర్శించమంటారని ప్రశ్నించారు. నటుడు విజయ్ ఆదిలో నటించిన చిత్రాలు చిన్నవేనని, అలాంటి ఆయన్ని స్టార్ నటుడిని చేసింది తామేనని అభిరామిరామనాథన్ వ్యాఖ్యానించారు.
ఎంఆర్‌కేఎన్‌ఎస్ సినీ మీడియా పతాకంపై ఆర్.ముత్తుకృష్ణ, వేల్‌మణి కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని అరుణ్‌శ్రీ దర్శకత్వం వహించారు. విజయ్ టీవీ ఫేమ్ వైశాలిని హీరోయిన్‌గా నాన్‌కడవుల్ రాజేంద్రన్ హీరో నటించిన ఈ హర్రర్, థ్రిల్లర్, కామెడీ చిత్రానికి రాజన్ చోళన్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియోను దర్శక నటుడు కే.భాగ్యరాజ్ ఆవిష్కరించగా అభిరామి రామనాథన్ తొలి ప్రతిని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment