మెర్సల్‌ ముందు ఎంతనుకుంటే... | Meyaadha Maan Suprising Collections | Sakshi
Sakshi News home page

మెర్సల్‌తో పోటీ పడి సూపర్ హిట్‌ టాక్‌

Published Thu, Oct 26 2017 6:48 PM | Last Updated on Thu, Oct 26 2017 6:48 PM

Meyaadha Maan Suprising Collections

సాక్షి, చెన్నై : ఓవైపు విజయ్‌ లాంటి బిగ్‌ స్టార్‌ సినిమా రిలీజ్‌. ఆ సమయంలో ఓ చిన్న సినిమా కూడా విడుదలకు సిద్ధమయ్యింది. అంతే సినిమా హీరో, దర్శకుడు మొత్తం చిత్ర యూనిట్‌ను సోషల్ మీడియాలో ట్రోల్‌ చేస్తూ పడేశారు. తమ హీరో కలెక్షన్ల సునామీలో కొట్టుకుపోతారంటూ కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన దర్శకుడు రత్న కుమార్ తాను విజయ్‌కి పెద్ద ఫ్యాన్‌నని ప్రకటించుకున్నా.. పట్టించుకోలేదు. అయినా ధైర్యం చేసి సినిమాను విడుదల చేశారు. తొలి మూడు రోజులు థియేటర్‌ వైపు చూసే వారే కరువయ్యారు. కట్‌ చేస్తే... మెయ్యాద మాన్ ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.

ఈ దీపావళికి విజయ్ మెర్సల్‌తోపాటు మెయ్యాద మాన్ కూడా విడుదలైంది. సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి తనయుడు వైభవ్‌ ఇందులో హీరోగా కనిపించాడు. ఓ స్టేజీషో సింగర్ ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రంలో ఇదయం మురళి(హృదయం మురళి) పాత్రలో వైభవ్ నటించాడు. మంచి ప్రేమకథకు దానికితోడు పాటలు(ముఖ్యంగా తంగచ్చి పాట) ఆకట్టుకోవటంతో నెమ్మదిగా మౌత్‌ టాక్‌ ద్వారా సినిమా పుంజుకుంది. ప్రస్తుతం చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా మెయ్యాద మాన్‌కు థియేటర్లను పెంచేశారు.  

మెర్సల్‌ ఉండగానే పోటీపడి మరీ కలెక్షన్లు కుమ్ముకుంటున్న ఈ చిన్న చిత్రం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను కూడా అందించటం మొదలుపెట్టేసిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక చిత్ర సక్సెస్‌ గురించి వైభవ్‌ స్పందిస్తూ.. విజయ్‌ సినిమా రిలీజ్‌ తో టెన్షన్‌ పడ్డామని.. ఆ సినిమా ముందు తామెంత అనుకున్నామని.. అయినా కంటెంట్ పై నమ్మకంతో ధైర్యం చేసినట్లు వైభవ్‌ చెప్పాడు.  మెర్సల్‌ సినిమా రిలీజ్, ఇదయదళపతి ఫ్యాన్స్‌ నుంచి బెదిరింపుల గురించి వైభవ్‌ ప్రస్తావిస్తూ.. తాను అజిత్‌ కు పెద్ద ఫ్యాన్‌ అయినప్పటికీ విజయ్‌ను కూడా ఆరాధిస్తానని, ఈ విషయాన్ని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతిని వైభవ్ గుర్తు చేశాడు. అన్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా ఈ చిత్రం చూసి ప్రశంసలు కురిపించటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement