చెన్నై: బీజేపీ నేతల జోక్యంతో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న తమిళ చిత్రం మెర్సల్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతుగా నిలిచారు. ‘శభాష్.. ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. మెర్సల్ చిత్ర బృందానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. అయితే అది ఏ అంశమో రజనీ స్పష్టం చేయలేదు.
వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై మెర్సల్ చిత్రంలో ఉన్న సంభాషణలపై తమిళనాడు బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా, రాష్ట్ర అధ్యక్షుడు సౌందరరాజన్, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌లు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, మెర్సల్ సినిమాను ఆన్‌లైన్‌లో చూసి బీజేపీ నేత రాజా పైరసీని ప్రోత్సహించారని తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఆరోపించారు. మెర్సల్ చిత్ర బృందానికి తమిళ సినీపరిశ్రమతో పాటు సీనియర్ నటుడు కమల్‌హాసన్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment