లక్కంటే ఇదే కాబోలు! | heroine kajal agarwal action in lady oriented movies | Sakshi
Sakshi News home page

ఐష్‌ స్థానంలో కాజల్‌..!

Published Wed, Oct 25 2017 5:21 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

 heroine kajal agarwal action in lady oriented movies - Sakshi

కాలం కలిసొస్తే అంతా మంచే జరుగుతుందని పెద్దలు అంటారు. అలాంటి టైమ్‌ ఇప్పుడు హీరోయిన్‌ కాజల్ అగర్వాల్‌కు నడుస్తోందని చెప్పవచ్చు. విజయాలను బట్టి అవకాశాలు వరిస్తుంటాయి. అలానే హీరోయిన్‌ కాజల్‌ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి, తమిళంలో వివేగం, మెర్శల్‌ చిత్రాల సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ భామను ఇప్పటి వరకూ గ్లామరస్‌ పాత్రల్లోనే చూశాం. తాజాగా కోలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో చూడబోతున్నాం.

ఈ విధమైన చిత్రాల్లో నయనతార నటిస్తున్నారు. ఇక కాజల్‌ కూడా నేను సైతం అంటున్నారు. ఇప్పటికే హిందీ భాషలోని ‘క్వీన్‌’ రీమేక్‌లో నటిస్తున్న ఈ భామను తాజాగా మరో అవకాశం తలుపు తట్టిందన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. దక్షిణాదిలో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పి. వాసు ఇటీవల శివలింగ చిత్రంతో సక్సెస్‌ అందుకున్నారు.

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో బాలీవుడ్‌ సుందరి ఐశ్వర్యరాయ్‌ను నటింపజేయాలని భావించారు. అందుకు ఆమెతో చర్చలు కూడా జరిగాయనే ప్రచారం జరిగింది. అయితే ఈ పాత్ర తాజాగా కాజల్‌ను వరించింది. ఐష్‌ స్థానాన్ని ఈ ముద్దుగుమ్మ భర్తీ చేస్తున్నారన్న మాట. లక్కంటే ఇదే కాబోలు మరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement