
తమిళసినిమా (చెన్నై): తమిళ చిత్రం మెర్సల్ వివాదం ముదురుతోంది. మెర్సల్ చిత్రానికి మద్దతుగా నిలిచిన తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ లక్ష్యంగా సోమవారం జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. చెన్నై, వడపళని, కుమరన్ కాలనీల్లోని విశాల్ కార్యాలయాలతో పాటు సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ తనిఖీలు చేసినట్లు సమాచారం.
దీంతో రాజకీయ కుట్రతోనే విశాల్‌పై దాడులు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. విశాల్ జీఎస్‌టీ పన్నును సరిగ్గా చెల్లిస్తున్నారా? లేదా అనే విషయంపై అధికారులు దాదాపు 3 గంటల పాటు సోదాలు నిర్వహించారని సమాచారం. అయితే తాము విశాల్ కార్యాలయాల్లో ఎలాంటి తనిఖీలు చేయలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) జాయింట్ డైరెక్టర్ పీవీకే రాజశేఖర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment