GST intelligence agency
-
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
భారత్‌పే వ్యవహారాలపై జీఎస్టీ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే పన్ను ఎగవేతలపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. సేవలకు సైతం నకిలీ ఇన్వాయిస్లను జారీ చేశారా, లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోనుంది. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి కంపెనీ పుస్తకాలను తనిఖీ చేసే పనిలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌పే సహ వ్యవస్థాపకుడైన అష్నీర్ గ్రోవర్, అయన భార్య మాధురి జైన్ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు కంపెనీ అంతర్గత దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. దీంతో గ్రోవర్ దంపతులను అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు భారత్‌పే ప్రకటించింది. భారత్‌పే ఎటు వంటి ఉత్పత్తులు సరఫరా చేయకుండానే నకిలీ ఇన్వాయిస్లు జారీ చేయడంపై జీఎస్టీ అధికారులు గడిచిన ఏడాది కాలం నుంచి దర్యాప్తు నిర్వహిస్తుండడం గమనార్హం. గతేడాది అక్టోబర్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు భారత్‌పే ప్రధాన కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. ‘‘సరుకుల సర ఫరా లేకుండానే ఇన్వాయిస్లు జారీ చేసిన కేసులో దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఎటువంటి సేవలు అందించకుండా ఇన్వాయిస్లు జారీ చేసినట్టు మాధురీ జైన్‌కు వ్యతిరేకంగా ఇటీవలి ఆరోపణలు రావడంపై వాటిపైనా దృష్టి పెట్టనున్నాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
మీరేం పెద్దమనుషులయ్యా, 35వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారు
న్యూఢిల్లీ: ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) దుర్వినియోగం చేయడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం రూ. 35,000 కోట్ల మేర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత మోసాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి 426 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో 14 మంది సీఏలు, లాయర్లు, డైరెక్టర్ల వంటి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. 2020–21లో సీజీఎస్టీ జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ).. నకిలీ ఐటీసీల విషయంలో 8,000 పైచిలుకు కేసులు నమోదు చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. సాధారణంగా జీఎస్టీ విధానంలో.. ఉత్పత్తిపై పన్ను చెల్లించేటప్పుడు సంస్థలు తాము ముడి వస్తువులపై (ఇన్పుట్) కట్టిన పన్ను తగ్గించుకుని, చెల్లించవచ్చు. అయితే, ఇన్పుట్ విషయంలో కొందరు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించడం ద్వారా ఐటీసీ విధానాన్ని దుర్వినియోగం చేసినట్లు సీబీఐసీ వివరించింది. దీనిపై దేశవ్యాప్తంగా 2020 నవంబర్ 9 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 1,200 సంస్థలకు సంబంధించి 500 కేసులు గుర్తించినట్లు, 24 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐసీ పేర్కొంది. చదవండి: మొండిబాకీల వసూళ్లు,లైసెన్సు కోసం సన్నాహాలు -
వెలుగులోకి రూ. 400 కోట్ల జీఎస్టీ స్కామ్
అహ్మదాబాద్: జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం రూ.400 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. దేశ రాజధాని ప్రాంతానికి చెందిన ఎగుమతిదారులు గుజరాత్‌లోని కాండ్లా ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)లోని యూనిట్ల సాయంతో రూ.400 కోట్ల వరకు జీఎస్టీ రిఫండ్‌ను పొందినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు గుర్తించారు. తక్కువ నాణ్యతతో కూడిన పొగాకు ఉత్పత్తులు సెంటెడ్ జర్దా, ఫిల్టర్ ఖైనీ కేంద్రంగా ఈ స్కామ్ జరిగినట్టు డీజీజీఐ తెలిపింది. వీటిని కిలో రూ.50–350కు కొనుగోలు చేసి, కాంట్లా ఎస్ఈజెడ్ యూనిట్లకు కిలో రూ.5,000–9,000కు ఎగుమతి చేసినట్టుగా చూపించారని పేర్కొంది. మార్కెట్ విలువ కంటే 3,000 శాతం అధికంగా చూపించడం ద్వారా అక్రమంగా రూ.400 కోట్లను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద పొందారని తెలిపింది. -
జీఎస్టీ దాడులు.. ఏంటీ కన్ఫ్యూజన్?
సాక్షి, చెన్నై : నటుడు, తమిళ చలన చిత్ర నిర్మాత మండలి చైర్మన్ విశాల్ ఇళ్లు, ఆఫీస్లపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ దాడులు చేశాయన్న వార్త నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. మెర్సల్ చిత్రానికి మద్దతుగా బీజేపీ నేత రాజాకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయటంతోనే విశాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారంటూ కొన్ని ఛానెళ్లు తమ వంతుగా క్లారిటీ కూడా ఇచ్చేశాయి. చెన్నై, వడపళని, కుమరన్ కాలనీల్లోని విశాల్ కార్యాలయాలతో పాటు సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు టీడీ నాంగేంద్రకుమార్ బృందం తనీఖీలు చేసినట్లు చెప్పుకున్నారు. నటుడు, నడిఘర్ సంఘం ఉపాధ్యక్షుడు కరుణాస్తోపాటు.. తాను ప్రతీ పైసా సరిగ్గా చెల్లించానని స్వయంగా విశాల్ ఓ ప్రకటన ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమనటంతో ఆ వార్త నిజమేనన్న నిర్ధారణకు మీడియా వచ్చింది. అయితే అత్యంత నాటకీయ పరిణామాలతో కోలీవుడ్ మీడియాలో చూపించిన ఈ పరిణామాలన్నీ ఉత్తవేనని చివరకు అధికారులు తెల్చేశారు. తాము విశాల్ కార్యాలయాల్లో ఎలాంటి తనిఖీలు చేయలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) జాయింట్ డైరెక్టర్ పీవీకే రాజశేఖర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా సీబీఈసీ విడుదల చేసింది. Clarification on reports by some news agencies that DGSTI conducted search on premises of Sh. Vishal, President TN Film Producers Council. pic.twitter.com/KGH3K34rjG — CBEC (@CBEC_India) 23 October 2017 -
విశాల్ టార్గెట్‌గా జీఎస్టీ దాడులు
తమిళసినిమా (చెన్నై): తమిళ చిత్రం మెర్సల్ వివాదం ముదురుతోంది. మెర్సల్ చిత్రానికి మద్దతుగా నిలిచిన తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ లక్ష్యంగా సోమవారం జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. చెన్నై, వడపళని, కుమరన్ కాలనీల్లోని విశాల్ కార్యాలయాలతో పాటు సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ తనిఖీలు చేసినట్లు సమాచారం. దీంతో రాజకీయ కుట్రతోనే విశాల్‌పై దాడులు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. విశాల్ జీఎస్టీ పన్నును సరిగ్గా చెల్లిస్తున్నారా? లేదా అనే విషయంపై అధికారులు దాదాపు 3 గంటల పాటు సోదాలు నిర్వహించారని సమాచారం. అయితే తాము విశాల్ కార్యాలయాల్లో ఎలాంటి తనిఖీలు చేయలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) జాయింట్ డైరెక్టర్ పీవీకే రాజశేఖర్ స్పష్టం చేశారు. -
విశాల్ కార్యాలయంలో జీఎస్టీ తనిఖీలు
-
విశాల్‌కు ఊహించని షాక్
సాక్షి, చెన్నై: మెర్శల్ సినిమాకు మద్దతుగా నిలిచిన హీరో విశాల్‌పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు హెచ్ రాజాపై విమర్శలు చేసి కొన్ని గంటలు గడవకముందే ఆయనకు షాక్ ఇచ్చింది. విశాల్ కార్యాలయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వడాపళనిలోని విశాల్ కార్యాలయానికి వచ్చిన అధికారులు ఆయన చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించిన చెల్లింపు వివరాలను పరిశీలించారు. వస్తు, సేవా పన్ను చెల్లింపుల్లో ఏదైనా ఎగవేత జరిగిందా అనే దాని గురించి శోధించేందుకు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల విడుదలైన మెర్శల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మెర్శల్ చిత్ర యూనిట్‌కు ప్రతిపక్షాలు దన్నుగా నిలిచాయి. కమల్‌హాసన్, రజనీకాంత్ సహా సినిమా ప్రముఖులు మెర్శల్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్ కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడి చేయడం సంచలనంగా మారింది. ‘మెర్శల్’కు అండగా నిలబడిన మిగతావారిపైనా దాడులు జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు పెట్టిన మెర్శల్ సినిమా పైరసీ కాపీని చూశానని హెచ్ రాజా ప్రకటించడంతో క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి పైరసీ సినిమా చూడటానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు. -
జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కొత్త చీఫ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొత్త చీఫ్‌గా జాన్ జోసెఫ్ నియమితులయ్యారు. సీనియర్ అధికారి అయిన జోసెఫ్‌ను జీఎస్టీ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పన్ను ఎగవేత, పన్ను అమలు తదితర పర్యవేక్షణలను ఈ జీఎస్టీ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తుంది. 1983 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన జోసెఫ్ ఆర్థిక శాఖలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సహా పలు కీలక విభాగాల్లో పనిచేశారు. అలాగే అక్రమ రవాణా, బ్లాక్ మనీని పర్యవేక్షించే డీఆర్ఐ చీఫ్‌గా దేబి ప్రసాద్ దాస్ నియమితులయ్యారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి అయిన దాస్‌ను డీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.