న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొత్త చీఫ్‌గా జాన్ జోసెఫ్ నియమితులయ్యారు. సీనియర్ అధికారి అయిన జోసెఫ్‌ను జీఎస్టీ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పన్ను ఎగవేత, పన్ను అమలు తదితర పర్యవేక్షణలను ఈ జీఎస్టీ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తుంది.
1983 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన జోసెఫ్ ఆర్థిక శాఖలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) సహా పలు కీలక విభాగాల్లో పనిచేశారు. అలాగే అక్రమ రవాణా, బ్లాక్ మనీని పర్యవేక్షించే డీఆర్‌ఐ చీఫ్‌గా దేబి ప్రసాద్ దాస్ నియమితులయ్యారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి అయిన దాస్‌ను డీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కొత్త చీఫ్
Published Mon, Jul 10 2017 8:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
Advertisement