సాక్షి, చెన్నై : నటుడు, తమిళ చలన చిత్ర నిర్మాత మండలి చైర్మన్ విశాల్ ఇళ్లు, ఆఫీస్‌లపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ దాడులు చేశాయన్న వార్త నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. మెర్సల్ చిత్రానికి మద్దతుగా బీజేపీ నేత రాజాకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయటంతోనే విశాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారంటూ కొన్ని ఛానెళ్లు తమ వంతుగా క్లారిటీ కూడా ఇచ్చేశాయి.
చెన్నై, వడపళని, కుమరన్ కాలనీల్లోని విశాల్ కార్యాలయాలతో పాటు సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు టీడీ నాంగేంద్రకుమార్ బృందం తనీఖీలు చేసినట్లు చెప్పుకున్నారు. నటుడు, నడిఘర్ సంఘం ఉపాధ్యక్షుడు కరుణాస్‌తోపాటు.. తాను ప్రతీ పైసా సరిగ్గా చెల్లించానని స్వయంగా విశాల్ ఓ ప్రకటన ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమనటంతో ఆ వార్త నిజమేనన్న నిర్ధారణకు మీడియా వచ్చింది.
అయితే అత్యంత నాటకీయ పరిణామాలతో కోలీవుడ్ మీడియాలో చూపించిన ఈ పరిణామాలన్నీ ఉత్తవేనని చివరకు అధికారులు తెల్చేశారు. తాము విశాల్ కార్యాలయాల్లో ఎలాంటి తనిఖీలు చేయలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) జాయింట్ డైరెక్టర్ పీవీకే రాజశేఖర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా సీబీఈసీ విడుదల చేసింది.
Clarification on reports by some news agencies that DGSTI conducted search on premises of Sh. Vishal, President TN Film Producers Council. pic.twitter.com/KGH3K34rjG
— CBEC (@CBEC_India) 23 October 2017
Comments
Please login to add a commentAdd a comment