H Raja
-
గెలుపు చిదంబర రహస్యం
తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి శివగంగ. కాంగ్రెస్ సీని యర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరం కిందటి ఎన్నికల్లో నాలుగో స్థానం లో నిలిచారు. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి హెచ్.రాజా మళ్లీ పోటీలో ఉన్నా రు. వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. 2014లో గెలిచిన ఏఐఏడీఎంకే నేత పీఆర్ సెంథిల్నాథన్, రెండో స్థానంలో ఉన్న డీఎంకే అభ్యర్థి దురై రాజ్ సుభా పొత్తుల కారణంగా పోటీ చేయడం లేదు. రాష్ట్రంలో రెండు కూటములకు నాయకత్వం వహిస్తున్న పాలక ఏఐఏడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తమ మిత్రపక్షాలకు ఈసారి శివగంగ సీటును కేటాయిం చాయి. కిందటి ఎన్నికల ముందు పి.చిదంబరం రాజ్యసభకు ఎన్నికవడంతో తొలిసారి లోక్‌సభకు పోటీచేయలేదు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన కొడుకు కార్తి ఓడిపోయారు. గత ఐదేళ్లలో ఆర్థిక నేరాలకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కార్తి ఇప్పుడు రెండోసారి గెలుపు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఏఐఏడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థి హెచ్.రాజాకు వివాదాస్పద ప్రకటనలతో సంచలనం సృష్టించే నేపథ్యం ఉంది. నోటి దురుసు నేత రాజా రెండు దశాబ్దాల క్రితం శివగంగలో కాంగ్రెస్ అభ్యర్థికి రాజా గట్టి పోటీ ఇచ్చినా ఆయన నోటి దురుసు వల్ల జనాదరణ కోల్పోయారు. పాలకపక్షమైన ఏఐఏడీఎంకేతో పొత్తు ఉన్నా ఆయన ఇమేజ్ కారణంగా ఆయన అభ్యర్థిత్వానికి బీజేపీ కార్యకర్తలు మొదట అంత అనుకూలంగా లేరు. ఇటీవల రాజా తమిళులంతా గౌరవించే పెరి యార్ ఈవీ రామస్వామి నాయకర్, మైనారిటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో గొడవపడిన సమయంలో ఆయన మద్రాసు హైకోర్టుపైన, శబరిమల ఆలయ ప్రవేశ వివాదంలో అన్ని వయసుల మహిళలపై కూడా అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. ఇలాంటి కరుడుగట్టిన హిందుత్వ రాజకీయాలు నడిపే నేత అభ్యర్థి అయితే ఓటర్లను ఆకట్టకోలేమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి కార్తిపై ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులుండటంతో ఇద్దరు వివాదాస్పద నేతల మధ్య పోటీ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కార్తి పేరు ప్రకటించడంలో జరిగిన ఆలస్యం కూడా కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. ఎయిర్‌సెల్–మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో నిందితుడైన కార్తి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ నాచయప్పన్ అభ్యంతరం చెప్పడంతో ఆయనకు శివగంగ టికెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జాప్యం చేసింది. చాలా కాలంగా తన కేసులకు సంబంధించి ముఖ్యంగా బెయిలు కోసం వేసిన పిటిషన్ల కారణంగా కార్తి వార్తల్లో ఉంటున్నారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన శివగంగలో రైతులు కష్టాల్లో మునిగి ఉన్నారు. వరి, చెరకు, పత్తి, మిరప, వేరు శనగ పండించే ఈ ప్రాంతంలోని రైతులు సాగు నీటి సమస్యతోపాటు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. చెరకు పం టకు కనీస మద్దతు ధర తగినంత లేకపోవడం, సాగునీటి కొరత వల్ల పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా పథకం ఇక్కడి రైతులను ఆదుకోలేకపోతోంది. చెరువుల్లో పూడిక తీయకపోవడం వల్ల ప్రజలు తాగు నీరులేక అల్లాడుతున్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నా అలాంటి ప్రయత్నాలు జరగటం లేదు. సున్నపురాయి, గ్రానైట్, గ్రాఫైట్ వంటి ఖనిజ నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నా రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పరిశ్రమల స్థాపన జరగడం లేదు. శివగంగ సమీపంలో తమిళనాడు మినరల్ లిమిటెడ్ కార్యాలయం ఉంది కానీ మైనింగ్ కార్యకలాపాలు పెరగడం లేదు. ఈ నేపథ్యంలో యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. పాలకపక్షాలపై వ్యతిరేకత బీజేపీకి అననుకూల అంశం.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దాని మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే అధికారంలో ఉండడంతో జనంలో పాలకపక్షాలపై వ్యతిరేకత హద్దులు దాటితే అదిక్కడ బీజేపీ అభ్యర్థికి అననుకూలం కావచ్చు. మందకొడిగా ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తన కొడుకు కార్తి గెలుపు కోసం చిదంబరం శివగంగలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నా రు. చిదంబరం దశాబ్దాల పాటు శివగంగ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి ఏం చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ పార్టీ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) అభ్యర్థి కూడా రంగంలో ఉండడంతో హిందువుల ఓట్లలో వచ్చే చీలిక బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. ఇక్కడి తేవర్ల ఓట్లు గణనీయంగానే ఈ పార్టీకి పడవచ్చని పరిశీలకుల అంచనా. కార్తి గెలుపు ఆయ న తండ్రి చిదంబరానికి అత్యంత ప్రతిష్టాత్మకరంగా మారింది. తండ్రి కంచుకోటలో కొడుకుకు పరీక్ష 1967లో ఏర్పడిన శివగంగ నుంచి చిదంబరం ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యా రు. టీఎంసీ తరఫున పోటీ చేసిన 1999లో ఒక్కసారే ఆయన ఇక్కడ ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై, రెండుసార్లు టీఎంసీ తరఫున విజయం సాధించారు. 1999లో చిదంబరాన్ని కాంగ్రెస్ అభ్యర్థి ఈఎం సుదర్శన్ నాచయప్పన్ ఓడించారు. ఆరు అసెంబ్లీ సెగ్మెం ట్లు ఉన్న శివగంగలో మొత్తం ఓటర్లు 11,07, 575. ఇక్కడ పోలింగ్ ఏప్రిల్ 18న జరుగుతుం ది. టీఎంసీతోపాటు ప్రధాన ప్రాంతీయ పక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే రెండేసిసార్లు ఇక్కడ గెలుపొందాయి. బీజేపీ అభ్యర్థి రాజా 1999లో 2,22,668 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలి చారు. ప్రస్తుతం బీజేపీ నుంచి రాజా బరిలోకి దిగగా, కాంగ్రెస్ నుంచి కార్తి చిదంబరం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
కలకలం రేపిన ఫేస్ బుక్ పోస్టు
సాక్షి, చెన్నై : తమిళనాడు బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఫేస్ బుక్‌లో చేసిన ఓ పోస్టు కలకలాన్ని రేపింది. పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలంటూ ఆయన ఓ పోస్టు చేయటం.. అది రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. త్రిపురలో గెలుపు తర్వాత బీజేపీ కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను కూడా ఫేస్బుక్లో పోస్టు చేసిన రాజా తమిళనాడు సామాజిక వేత్త ఈవీఆర్ రామస్వామి(పెరియార్) విగ్రహాన్ని కూడా కూల్చేయాలంటూ పోస్టు చేశారు. ‘లెనిన్ ఎవరూ, ఇండియాతో ఆయనకు సంబంధం ఏంటి? కమ్యూనిస్ట్‌లకు మన దేశానికి అసలు సంబంధం ఏంటి? నిన్న లెనిన్ విగ్రహాన్ని తొలగించారు. రేపు పెరియార్ విగ్రహం పరిస్థితి కూడా అంతే’ అని ఆయన పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో దానిని తొలగించారు. ద్రవిడార్ కగజమ్ స్థాపన ద్వారా తమిళుల ఆత్మగౌరవం కోసం పోరాడిన పెరియార్‌ను అవమానించారంటూ పలువురు మండిపడుతున్నారు. రాజాను అరెస్ట్ చేయాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఎండీఎంకే, సీపీఎం, సీపీఐలు కూడా రాజాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సౌందరరాజన్ ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించాడు. రాజా పోస్ట్ చేసిన ఫేస్ బుక్ పోస్టు ఇదే -
జీఎస్టీ దాడులు.. ఏంటీ కన్ఫ్యూజన్?
సాక్షి, చెన్నై : నటుడు, తమిళ చలన చిత్ర నిర్మాత మండలి చైర్మన్ విశాల్ ఇళ్లు, ఆఫీస్లపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ దాడులు చేశాయన్న వార్త నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. మెర్సల్ చిత్రానికి మద్దతుగా బీజేపీ నేత రాజాకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయటంతోనే విశాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారంటూ కొన్ని ఛానెళ్లు తమ వంతుగా క్లారిటీ కూడా ఇచ్చేశాయి. చెన్నై, వడపళని, కుమరన్ కాలనీల్లోని విశాల్ కార్యాలయాలతో పాటు సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు టీడీ నాంగేంద్రకుమార్ బృందం తనీఖీలు చేసినట్లు చెప్పుకున్నారు. నటుడు, నడిఘర్ సంఘం ఉపాధ్యక్షుడు కరుణాస్తోపాటు.. తాను ప్రతీ పైసా సరిగ్గా చెల్లించానని స్వయంగా విశాల్ ఓ ప్రకటన ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమనటంతో ఆ వార్త నిజమేనన్న నిర్ధారణకు మీడియా వచ్చింది. అయితే అత్యంత నాటకీయ పరిణామాలతో కోలీవుడ్ మీడియాలో చూపించిన ఈ పరిణామాలన్నీ ఉత్తవేనని చివరకు అధికారులు తెల్చేశారు. తాము విశాల్ కార్యాలయాల్లో ఎలాంటి తనిఖీలు చేయలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) జాయింట్ డైరెక్టర్ పీవీకే రాజశేఖర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా సీబీఈసీ విడుదల చేసింది. Clarification on reports by some news agencies that DGSTI conducted search on premises of Sh. Vishal, President TN Film Producers Council. pic.twitter.com/KGH3K34rjG — CBEC (@CBEC_India) 23 October 2017 -
పైరసీ చూస్తివా.. సిగ్గు లేదా?
సాక్షి, చెన్నై : మెర్సల్ సినిమాలో అభ్యంతరకర డైలాగులను తొలగించేందుకు నిర్మాతలు సిద్ధమైనప్పటికీ.. వివాదం ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఈ విషయంలో చిత్ర యూనిట్‌కు ఊహించని మద్దతు లభించింది. తమిళనాడుకే చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు మెర్సల్ డైలాగులు ఏ మాత్రం తప్పు కాదని వ్యాఖ్యానించారు. దక్షిణ చెన్నై బీజేపీ విభాగానికి చెందిన సీనియర్ నేత సిధార్త్ మణి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మెర్సల్‌లో జీఎస్టీ వ్యతిరేక డైలాగులు తప్పేం కాదని చెప్పారు. అది చిత్ర యూనిట్ అభిప్రాయం. సినిమా మూలంగా గౌరవం దెబ్బతింటుందన్న వాదన అస్సలు సరికాదు. అనవసరంగా పార్టీకి ఆపాదించి ఈ సమస్యను కొందరు పెద్దది చేశారు అంటూ ఆయన సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్ రాజాపై హీరో విశాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఓ ఇంటర్వ్యూలో రాజా.. తాను మెర్సల్ సినిమా పైరసీ కాపీని చూశానని, అందులోని డైలాగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాల్ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఓ జాతీయ నేత అయి ఉండి ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్న పైరసీని ప్రొత్సహించటం దారుణమన్నాడు. పైగా సినిమాను పైరసీలో చూశానని చెప్పటం మరింత ఘోరమని విశాల్ పేర్కొన్నాడు. ‘‘మీరోక బాధ్యతగల పదవిలో ఉన్నారు. పైగా సంఘంలో గౌరవం ఉన్న పెద్ద మనిషి. పైరసీ చూశానని చెబుతున్నారు. సిగ్గు లేదా?’’ అంటూ ఘాటుగా రాజాకు చురకలంటించాడు. తక్షణమే క్షమాపణలు తెలియజేసి, పైరసీ లింకులు తొలగించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని విశాల్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. మరో సీనియర్ నటుడు పార్తీబన్ కూడా రాజా చేసిన పనిని తప్పుబడుతూ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. மரியாதைக்குரிய எச்.ராஜா அவர்களுக்குரிய மரியாதையை குறைக்க வேண்டும்-அவர் களவாடி(யாய்) மெர்சல் கண்டிருந்தால்..! — R.Parthiban (@rparthiepan) October 22, 2017 It mUSt be created by some of US pic.twitter.com/44FzIlgi37 — R.Parthiban (@rparthiepan) October 23, 2017 -
బీజేపీ నేతకు భారీ షాక్
కేవలం 52 ఓట్లతో సరిపెట్టుకున్న రాజా ఉత్కంఠగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్నికలు అధ్యక్షుడిగా మణి బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజాకు శనివారం పెద్ద షాక్ తగిలింది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తమిళనాడు విభాగం ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. కేవలం 52 ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో విద్యా శాఖ మాజీ డైరెక్టర్ మణి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాక్షి, చెన్నై : భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తమిళనాడు విభాగానికి 12 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. అయితే, ఈసారి ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో జాతీయస్థాయి నుంచి మంతనాలు సాగాయి. ఇందుకు కారణం ఆ సంఘానికి అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా రేసులో నిలబడడమే. ఎన్నికల బరిలో నిలబడే సమయంలో ఆయన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తమిళనాడు నిర్వాహకుల మీద విరుచుకుపడ్డారు. విద్యార్థులకు చేరాల్సిన నిధుల్ని దుర్వినియోగం చేశారని, అవినీతి తాండవం చేసినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో ఆ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగడం తమిళనాట రాజకీయ పక్షాల్లో వ్యతిరేకత బయలుదేరింది. అధికారపక్షం పరోక్షంగా మద్దతిచ్చినా, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విద్యార్థుల మీద కాషాయం రంగు రుద్దే ప్రయత్నంలో భాగం గానే అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాజా తీవ్ర కుస్తీలు పడుతున్నారన్న ఆరోపణలు గుప్పిం చాయి. ఇందుకు రాజా ఎదురుదాడి సాగిం చినా, గెలుపు తనదేనన్న ధీమాతో ముందుకు సాగారని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో రాజా గెలిస్తే తమిళనాట కమలం పాగే వేసినట్టే అన్నట్టుగా ఆయన మద్దతుదారులు వ్యవహరించా రన్న ప్రచారం ఉంది. అయితే, తమిళనాట కమలం పాదం మోపేందుకు ఆస్కారం లేదన్నట్టుగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్నికల్లో తీర్పు రావడం గమనార్హం. కేవలం 52 ఓట్లతో రాజా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఏమేరకు తమిళుల్లో కాషాయం మీద వ్యతిరేకత ఉందో అనే చర్చ ఊపందుకుంది. రాజా ఓటమి స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఐదు వందల మంది సభ్యులున్నారు. చెన్నై వేదికగా ఓటింగ్‌కు తగ్గ ఏర్పాట్లుచేశారు. ఎన్నికల అధికారిగా కళావతి వ్యవహరించారు. రాజాకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ మాజీ ఉపాధ్యక్షుడు, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ మణి బరిలో దిగారు. దీంతో పోరు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ తప్పలేదు. ఈ పదవికి ప్రప్రథమంగా ఓ రాజకీయ నేత పోటీకి దిగడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి మూడు గంటల వరకు సాగిన ఎన్నికల్లో 286 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజా గెలుపు మీద మద్దతుదారుల్లో ధీమా ఉన్నా, చివరకు ఆయనకు షాక్ తప్పలేదు. ఆయన ప్రత్యర్థి మణి భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. మణికి 232 ఓట్లు, రాజాకు 52 ఓట్లు రాగా, రెం డు ఓట్లు చెల్లనివిగా తేల్చారు. తనను గెలిపించిన వారందరికీ మణి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కోటి 32 లక్షల మంది మనవళ్లు, మనవరాళ్లు స్కూళ్లల్లో తనకు ఉన్నారని, వీళ్లందరి సంక్షేమం లక్ష్యంగా, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లోని ప్రతి సభ్యుడికి సహకారంగా ముందుకు సాగుతానని ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఈ గెలుపు చెల్లదంటూ జాతీయస్థాయిలో రాజా ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు. అవినీతి చోటుచేసుకుందని, అందుకే ఏకపక్షంగా ఎన్నిక సాగిందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికను రద్దుచేయిస్తానని ఆయన ముం దుకు సాగినా, అందుకు ఆస్కారం లేదని, అన్నీ సక్రమంగానే జరిగినట్టు ఎన్నికల అధికారి కళావతి పేర్కొన్నారు. -
అనితది సూసైడ్ కాదు.. హత్య!
సాక్షి, చెన్నై: నీట్ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతం రాజకీయ మలుపు తీసుకుంది. అధికార పక్షాలే లక్ష్యంగా విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. శనివారం సాయంత్రం అరియాళూరు వెళ్లిన ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్, అనిత తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పళని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో స్టాలిన్ విరుచుకుపడ్డారు. దళిత విద్యార్థిని అనిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చింది తప్పుడు హామీనేనని స్టాలిన్ పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వాలు చేసిన హత్యేనని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళని స్వామి, ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పనిలో పనిగా ఆయన బీజేపీపై కూడా విమర్శలు చేశారు. అనిత కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించటమే కాదు.. ఆమె కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్టాలిన్ ప్రకటించారు. ఇక తమ పార్టీపై చేసిన విమర్శలను బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఖండించారు. విద్యార్థి మరణాన్ని రాజకీయం చేయటం సరికాదని ఆయన హితవు పలికారు. వెల్లూరులో కొన్నాళ్ల క్రితం నీట్ విద్యార్థి తల్లి చనిపోయిన సమయంలో మీరంతా ఎక్కడి వెళ్లారంటూ స్టాలిన్‌కు రాజా చురకలంటించారు. నీట్ అర్హత సాధించలేకపోవటంతో మెరిట్ విద్యార్థిని అనిత సూసైడ్ చేసుకున్న తెలిసిందే. -
'కమలహాసన్ పేరు మార్చు కోవాలి'
చెన్నై: నటుడు కమలహాసన్ తన పేరును తమిళంలోకి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్.రాజా వ్యాఖ్యానించారు. కమలహాసన్ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడిన తీరు పెద్ద దుమారాన్నే రేపింది. ఆస్తికం,నాస్తికం, హేతువాదం, మూఢ నమ్మకాలు, పశు మాంసం, అవార్డు తిరిగి ఇవ్వడం వంటి పలు అంశాలపై కమలహాసన్ తనదైన బాణీలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఆయనకు ఒక లేఖ రాశారు. అందులో నటుడు కమలహాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అటు ఆస్తికాన్ని, ఇటు నాస్తికాన్ని సూచించేవిగా కాకుండా సంస్కృత పదాల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అసలు కమలహాసన్ అన్న పేరు తమిళమా అంటూ ప్రశ్నించారు. ముందు సంస్కృతం అయిన కమలహాసన్ అన్న తన పేరును ఆయన మార్చుకోవాలని సూచించారు. అదే విధంగా తన కూతురుకు కూడా శ్రుతి అనే సంస్కృత పేరునే పెట్టుకున్నారని ఆరోపించారు. ఇలా కమలహాసన్ పలు విషయాల గురించి మూలాలు తెలియకుండా అవగాహనారాహిత్యంతో మాట్లాడడాన్ని హెచ్.రాజా తప్పుపట్టారు. -
బీజేపీ సారథి హెచ్ రాజా
చెన్నై, సాక్షి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్ రాజా నియమితులయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ 2009 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒకరికి ఒకే పదవి కింద పొన్ రాధాకృష్ణన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి ఉంది. కొత్త అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే అంశంపై కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలోచనలు సాగుతున్నాయి. సీనియర్ నేత ఇల గణేషన్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని తొలుత నిర్ణయించారు. అయితే పార్టీ అధ్యక్ష పదవి తనకొద్దని గణేషన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా హెచ్ రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ అధ్యక్షుడు సీపీ రాధాకృష్ణన్ తదితరులు గట్టిగా పోటీపడ్డారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ మురళీధరరావు ఈనెల 18వ తేదీ చెన్నైకి చేరుకుని పార్టీ ముఖ్యలతో సమావేశమయ్యూరు. రాష్ట్రంలో పార్టీ పరంగా ఏర్పడిన 42 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై రాజా, తమిళిసై పేర్లను ప్రతిపాదించారు. రెండుపేర్లను పరిశీలించిన తరువాత రాజాకే పట్టం కట్టేందుకు సిద్ధమయ్యూరు. ఈ విషయంపై బీజేపీ నేత మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాకు మురళీధర రావు వివరిస్తారని తెలిపారు. పార్టీ జాతీయ నాయకులతో అమిత్ షా చర్చించి మరో రెండు రోజుల్లో రాజా పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.