సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్సల్’పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే సినిమాను తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా తాజాగా బీజేపీ కూడా ఈ జాబితాలో చేరింది. ప్రజా సంక్షేమం కోసం ప్రధాని చేపట్టిన కార్యక్రమాలపై ఈ వాఖ్యలు సరికాదంటూ బీజేపీ వర్గాలు నిరసన తెలుపుతున్నాయి.
మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో డిజిటల్ ఇండియా, జీఎస్టీ అమలుపై డైలాగులు కూడా వివాదస్పదమయ్యాయి. ఈ రెండు అంశాలపై అసత్య సమాచారం ఇచ్చారని బీజేపీ మండిపడింది. వీటిని తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే హీరో విజయ్‌కు, సినిమాకు మరో అగ్రనాయకుడు కమల్‌హాసన్ మద్దతుగా నిలిచారు. సినిమాను అన్నివిధాలుగా సెన్సార్ బోర్డు సెన్సార్ చేసిందన్నాడు. కాగా వివాదాస్పదంగా ఉన్న సన్నివేశాలను తీసేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. వ్యవస్థపై సరైన రీతిలో విమర్శలు చేయడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, ఈనెల 18న విడుదలైన ‘మెర్శల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment