Bharatiya Janta Party
-
2023 టార్గెట్ గా పావులు కదుపుతున్న బీజేపీ
-
తెలంగాణ ద్రోహిగా మిగలనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను ఏపీ తరలించుకుపోతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. శనివారం ఆన్లైన్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కేం ద్రానికి సీఎం, సీఎస్‌లు ఒక్క లేఖ కూడా రాయలేదని, కింది స్థాయి అధికారులతో రాయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వైఖరిని గమనించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను స్పందించానని, కేంద్రమంత్రిని కలిశానని తెలిపారు. గంటల తరబడి సెక్రటేరియట్ నిర్మాణంపై మీటింగ్‌లు పెట్టిన సీఎం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఎందుకు హాజరు కావడం లేదని, ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏముందని సంజయ్ ప్రశ్నించారు. సీఎంకి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 11లోపు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పాలని, లేదంటే తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతారన్నారు. -
మెర్సల్’పై విమర్శలు వెల్లువ
-
మెర్సెల్పై కమల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్సల్’పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే సినిమాను తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా తాజాగా బీజేపీ కూడా ఈ జాబితాలో చేరింది. ప్రజా సంక్షేమం కోసం ప్రధాని చేపట్టిన కార్యక్రమాలపై ఈ వాఖ్యలు సరికాదంటూ బీజేపీ వర్గాలు నిరసన తెలుపుతున్నాయి. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో డిజిటల్ ఇండియా, జీఎస్టీ అమలుపై డైలాగులు కూడా వివాదస్పదమయ్యాయి. ఈ రెండు అంశాలపై అసత్య సమాచారం ఇచ్చారని బీజేపీ మండిపడింది. వీటిని తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే హీరో విజయ్‌కు, సినిమాకు మరో అగ్రనాయకుడు కమల్‌హాసన్ మద్దతుగా నిలిచారు. సినిమాను అన్నివిధాలుగా సెన్సార్ బోర్డు సెన్సార్ చేసిందన్నాడు. కాగా వివాదాస్పదంగా ఉన్న సన్నివేశాలను తీసేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. వ్యవస్థపై సరైన రీతిలో విమర్శలు చేయడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈనెల 18న విడుదలైన ‘మెర్శల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది. -
గెలుపు కోసం ‘షా’న్దార్ వ్యూహాలు
ముంబై: రాష్ట్ర శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయం దక్కేలా వ్యూహాలు రూపొందించిన అమిత్ షా ఇప్పుడు మహారాష్ట్రంలో మహాకూటమికి అధికారం దక్కేలా పథకరచన చేస్తున్నారు. అమిత్ షా మార్గదర్శకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో షా వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని, అయితే మహారాష్ట్రంలో మాత్రం యూపీ ఫార్ములాను అమలు చేయబోమని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర కోసం మహా ఫార్ములాను షా రూపొందిస్తున్నారని, ఇప్పటికే ఫార్ములాను అమలు చేయడం ప్రారంభించామన్నారు. అయితే షాపై వస్తున్న ఆరోపణల విషయంలో మీకు ఎలాంటి భయమైనా ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ... ‘ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయపరమైనవే. వాటిని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్దంగా ఉంది. షాపై వస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని యూపీఏ హయాంలోనే సీబీఐ తేల్చిచెప్పింది. షా ఇక్కడికి వస్తున్నారంటేనే మా ప్రత్యర్థుల్లో గుబులు మొదలైంది. వాళ్ల తలరాతలను మార్చే ఎన్నికలు త్వరలో జరగనున్నాయ’ని చెప్పారు. సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు... ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేరు వినిపిస్తోందని, ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ... దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహాకూటమి సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం. రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి కాషాయ కూటమిలో లేదు. అందుకు ఇంకా సమయముంది. సీట్ల కేటాయింపుపై కూడా అదే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామ’న్నారు. -
'మద్రాస్ కేఫే'కు వ్యతిరేకంగా బీజేపీ, తమిళుల నిరసన
'మద్రాస్ కేఫే' విడుదల నిలిపివేయాలంటూ భారతీయ తమిళులు, బీజేపీ మద్దతు దారులు ముంబైలోని ప్లకార్డులతో నిరసన చేశారు. 'మద్రాస్ కెఫే' చిత్రంలో తమ మనోభావాలకు వ్యతిరేకంగా సన్నివేశాలు చిత్రించారనే ఆరో్పణలతో తమిళులు నిరసన తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 23 తేదిన విడుదలవుతోంది.