
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను ఏపీ తరలించుకుపోతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. శనివారం ఆన్‌లైన్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కేం ద్రానికి సీఎం, సీఎస్‌లు ఒక్క లేఖ కూడా రాయలేదని, కింది స్థాయి అధికారులతో రాయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వైఖరిని గమనించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను స్పందించానని, కేంద్రమంత్రిని కలిశానని తెలిపారు. గంటల తరబడి సెక్రటేరియట్ నిర్మాణంపై మీటింగ్‌లు పెట్టిన సీఎం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఎందుకు హాజరు కావడం లేదని, ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏముందని సంజయ్ ప్రశ్నించారు. సీఎంకి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 11లోపు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పాలని, లేదంటే తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment