కల్యాణ్, రామసత్యనారాయణ, నరసింహ, విజయేంద్ర ప్రసాద్
జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘సిగ్గు’ ఆదివారం ప్రారంభం అయింది. భీమవరం టాకీస్ పతాకంపై టి. రామసత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు కె.విజయేంద్ర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ క్లాప్ ఇచ్చారు.
డైరెక్టర్ వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాతలు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శక–నిర్మాతలకు అందించారు. ‘‘చలంగారి నవల ‘సుశీల’ ఆధారంగా ‘సిగ్గు’ చేస్తున్నాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘సి.కల్యాణ్‌గారి సపోర్ట్‌తో ముందుకు వెళ్తున్నాను’’ అన్నారు టి.రామసత్య నారాయణ. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, డైరెక్టర్ రేలంగి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సుక్కు, కెమెరా: అబ్బూరి ఈషే.
Comments
Please login to add a commentAdd a comment