ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు శ్రీకాంత్. మొదట్లో నెగటివ్ పాత్రలు చేసినా.. హీరోగా సక్సెస్ అయ్యారు. సహాయ పాత్రల్లో కూడా శ్రీకాంత్ అలరించారు. మళ్లీ చాలా ఏళ్ల తరువాత ‘యుద్దం శరణం’ సినిమాతో నెగటివ్ పాత్రను ట్రై చేసినా వర్కౌట్ కాలేదు.
సోలో హీరోగా శ్రీకాంత్‌కు హిట్ లేక చాలా కాలమైంది. ఈమధ్యే రా..రా అనే హరర్ మూవీ చేసినా.. ఫలితం లేకపోయింది. అయితే మళ్లీ శ్రీకాంత్ హీరోగా ‘కోతల రాయుడు’ అనే మూవీ షూటింగ్‌ను ఈరోజు ప్రారంభించారు. సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను వెంకట రమణ మూవీస్‌పై కోలాన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment