శ్రీవారి ఫిలిమ్స్ సంస్థ కోసం బాహుబలి వంటి పలు చిత్రాలకు కథను అందించిన ప్రఖ్యాత రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్దం చేయడానికి అంగీకరించారన్నది తాజా సమాచారం. ఈయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ చిత్రాలకు అందించిన కథలు అద్భుత విజయాలను సాధించాయి. కాగా అనేక చిత్రాలకు పంపీణీదారుడిగా వ్యవహరించిన పి. రంగనాథన్ నిర్మాతగా మారి తమిళంలో యోగిబాబు కథానాయకుడిగా ధర్మప్రభు, గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా ఆనందం విళైయాడు వీడు చిత్రాలను నిర్మించారు.
తాజాగా మూడవ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనాలు అందించడానికి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ చిత్రాల కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అంగీకరించినట్లు పి.రంగనాథన్ మంగళవారం అదికారికంగా మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ భారీ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Proud to announce that Legendary writer #KVVijayendraPrasad to pen Story & Screenplay for Our Next Production Venture. #SVFNext @onlynikil pic.twitter.com/EQFsCOFI2q
— Sri Vaari Film (@srivaarifilm) January 18, 2022
Comments
Please login to add a commentAdd a comment