‘అది నా కథ. నాకు తెలియకుండా కొట్టేశారు’ అంటూ అప్పుడప్పుడూ రచయితలో, దర్శకులో ఆరోపించే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ వివాదం హాట్ టాపిక్ అయింది. ఇది శంకర్ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన వివాదం. రామ్‌చరణ్ (‘ఆర్‌సీ 15’.. చరణ్‌కి ఇది 15వ సినిమా) హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ ప్యాన్ ఇండియా మూవీ నిర్మించనున్న విషయం తెలిసిందే.
‘భారతీయుడు 2’ పూర్తి చేశాకే శంకర్ ఈ సినిమా చేయాలని ఆ చిత్రనిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయమూ విదితమే. మరోవైపు ‘అపరిచితుడు’ రీమేక్ వివాదం కూడా ఎదుర్కొన్నారు శంకర్. తాజాగా.. రామ్‌చరణ్ సినిమా కోసం తయారు చేసిన కథ తనదేనంటూ చెల్లముత్తు అనే రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు చెల్లముత్తు.
ఇటు రామ్ చరణ్ సినిమా, అటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ప్లాన్స్‌తో బిజీగా ఉన్న శంకర్ ‘ఆర్‌సీ 15’కి కథ తయారు చేసి ఇవ్వమని కార్తీక్ సుబ్బరాజ్‌ని కోరారట. ఆ మేరకు కార్తీక్ ఓ కథ తయారు చేసి ఇచ్చారట. ఆ కథ తనదని చెల్లముత్తు ఆరోపిస్తున్నారు. కార్తీక్, చెల్లముత్తులతో మాట్లాడి, అసలు కథేంటి? కథ ఎవరిది? అనే విషయంలో రచయితల సంఘం త్వరలో తీర్పు వెల్లడిస్తుందని కోలీవుడ్ టాక్.
చదవండి : డాక్టర్‌తో డైరెక్టర్ వివాహం.. హాజరైన ప్రముఖులు
అల్లు అర్జున్‌తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక
Comments
Please login to add a commentAdd a comment