బయోపిక్ రాస్తున్న బాహుబలి రైటర్ | Vijayendra Prasad on Tenjing Norge biopic | Sakshi
Sakshi News home page

బయోపిక్ రాస్తున్న బాహుబలి రైటర్

Published Tue, Aug 9 2016 11:42 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

బయోపిక్ రాస్తున్న బాహుబలి రైటర్

బయోపిక్ రాస్తున్న బాహుబలి రైటర్

ఒకే సమయంలో బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి రెండు భారీచిత్రాలను అందించి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాలకు కూడా కథ అందిస్తున్న ఆయన, తొలిసారిగా ఓ బయోపిక్ను రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఎక్కువగా క్రీడాకారుల బయోపిక్లు మాత్రమే వచ్చాయి. కానీ విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఓ పర్వతారోహకుడి కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
 
ఎవరెస్ట్ సహా ఎన్నో పర్వతాలను అధిరోహించిన.., నేపాల్ కు చెందిన సాహసోపేత పర్వతారోహకుడు టెన్జింగ్ నార్గే కథను సినిమాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. 20 శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ కొనియాడిన టెన్జింగ్ సాహసాలు సినిమా కథకు ఏ మాత్రం తీసిపోవన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఒకే ఒక్కడు సినిమాకు రీమేక్గా బాలీవుడ్లో తెరకెక్కిన నాయక్, విక్రమార్కుడు రీమేక్గా తెరకెక్కిన రౌడీ రాథోడ్ చిత్రాలకు సీక్వల్స్ను కూడా రెడీ చేస్తున్నట్టుగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement