సాక్షి, అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై త్వరలో సినిమాతోపాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్‌మాధవ్ రచించిన ‘ది హిందూత్వ పారడైమ్’ పుస్తక పరిచయ కార్యక్రమం విజయవాడలోని కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో మంగళవారం జరిగింది. సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌పై తనకున్న భావన వేరని, దానిపై చిత్రాన్ని తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్‌పూర్ వెళ్లి వాస్తవాలను తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానని వివరించారు.
ఇదీ చదవండి: ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment