
బాహుబలి కథకుడి దర్శకత్వంలో రజనీకాంత్
ప్రపంచ సినిమా అంతా వహ్‌వా అంటున్న చిత్రం బాహుబలి. భారతీయ సినీ చరిత్రలోనే *500 కోట్లు వసూలు చేసి ఇప్పట్లో ఏ చిత్రం దాని దరిదాపుల్లో రానంత రికార్డులను బద్దలు కొడుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రానికి ప్రభాస్,రాణా,అనుష్క, తమన్న తదితరులు తారాగణం. దర్శకుడు రాజమౌళి. ఇదంతా తెలిసిన విషయమే. అయితే ఈ చిత్ర విజయానికి ప్రదాన కారణాల్లో ఒకటి కథ. ఆ కథ సృష్టికర్త తెలుగులో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్.
ఈయన దర్శకుడు రాజమౌళి తండ్రి. ఇప్పటి వరకు ఇతర భాషల్లో పెద్దగా ప్రచారం పొందని ఈయన ఇప్పుడు మరింత ప్రాచుర్యం పొందుతున్నారు. ఇటు బాహుబలి బ్రహ్మాండ విజయం, బాలీవుడ్‌లో ఈయన కథతో తెర కెక్కి సూపర్ హిట్ అయిన భజ్‌రంగీ భైజాన్ చిత్రాలు విజయేంద్రప్రసాద్‌కు బహుళ ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి.తాజా సమాచారం ఏమిటంటే ఈ ప్రఖ్యాత రచయిత సూపర్‌స్టార్ రజనీకాంత్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారట.
ఆ కథను ఇటీవల ఒక కార్యక్రమంలో కలిసిన రజనీకాంత్‌కు చెప్పగా ఆయనకు విపరీతంగా నచ్చేసిందట.అంతేకాదు ఈ కథలో విజయేంద్రప్రసాద్ దర్శకత్వంతో నటించడానికి అంగీకారం తెలిపారని సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నరు. ఈ చిత్రం తరువాత శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2లో నటించనున్నారు. 2016లో విజయేంద్రప్రసాద్, రజనీకాంత్‌ల చిత్రం ప్రారంభం అవుతుందని కోలీవుడ్ సమాచారం.