Vijayendra Prasad Unveils Sharapanjaram First Song: గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది ? ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘శరపంజరం’. నవీన్ కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. లయ హీరోయిన్‌కు యాక్ట్ చేస్తున్నారు. నవీన్ కుమార్, టి. గణపతి రెడ్డి, మల్లిక్ ఎంవీకే నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ఫస్ట్ గ్లింప్స్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, 4 నిమిషాల వీడియోను మామిడాల హరికృష్ణ, దర్శకుడు వేణు ఊడుగుల రిలీజ్ చేశారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కాలం మారినా కొన్ని చోట్ల జోగిని వ్యవస్థ లాంటి దూరాచారాలు కొనసాగుతున్నాయి. వాటిని రూపు మాపే క్రమంలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా 12 ఏళ్ల కల’’ అని పేర్కొన్నారు నవీన్ కుమార్ గట్టు. ‘‘మా సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు మల్లిక్, గణపతి రెడ్డి ఆశాభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment