jogini system
-
‘దేవుడే’ దిక్కు..!
నా తల్లిదండ్రులు నన్ను జోగినిగా చేసి వదిలేశారు. ఉపాధి లేక దొరికిన రోజు కూలి పనులకు వెళ్తున్నా. వచ్చే కూలి పైసలతో కుటుంబ పోషణ భార మైంది. ప్రభు త్వం మాకు దళిత బంధు ఇస్తే ఉపాధి కల్పించినోళ్లయితరు. – గుర్రం బాలమ్మ నన్ను తెలియని వయసు లో జోగినిగా మార్చారు. నాకు ఇద్దరు పిల్లలు. మట్టి పని చేస్తూ సాకుతున్నా. పింఛన్ కోసం నాలుగేళ్లుగా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ పెన్షన్ రాలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. – చెక్క తిరుమలమ్మ నన్ను జోగినిగా మార్చి 25 ఏళ్లు. ఈమె నా బిడ్డ భారతి. తండ్రి పేరు లేనిదే స్కూల్లో చేర్పించుకోమని చెప్పడంతో చదువు చెప్పించలేదు. మాకు ఈ పెంకుటిల్లు తప్ప వేరేది లేదు. వర్షం వస్తే ఇల్లంతా నీళ్లే. కూతురి కూలిపైనే కడుపు నింపుకొంటున్నాం. మాకు గృహ లక్ష్మితో పాటు స్వయం ఉపాధి కల్పించాలి. – దొర్లపల్లి ఎల్లమ్మ మాది పులిమామిడి గ్రామం. నాకు 38 ఏళ్లు.. ముగ్గురు పిల్లలు. నన్ను 20 ఏళ్ల క్రితమే జోగినిని చేశారు. ఒంటరి మహిళ కింద ఆసరా పింఛన్ కోసం మూడు సార్లు ఊట్కూరు మండల కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. మా తరఫున మాట్లాడేవారు లేకపోవడంతో అధికారులు అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారు. – శిపురం గజలమ్మ ..ఈ నలుగురే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సమాజంలో దేవుడి భార్యలుగా చెలామణి అవుతున్న వారి దీన గాథ ఇది. కూడు, గూడు, ఉపాధి లేక నానాపాట్లు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒంటరి పింఛన్ మినహా.. వారి స్థితిగతులను మార్చేలా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు పడకపోవడంపై వారిలో ఆవేదనతో కూడిన అసంతృప్తి పెల్లుబికుతోంది. ఆధునిక కాలంలోనూ ఆదరణకు నోచుకోకపోవడం.. విద్య, ఆర్థిక తదితర రంగాల్లో వెనుకబాటుతనం వెరసి దుర్భర జీవితాలు అనుభవిస్తున్న జోగినులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ఏడేళ్ల క్రితం వరకు యథేచ్ఛగా.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన అట్టడుగు వర్గాల స్త్రీలను జోగినులుగా మార్చి దేవతలకు అర్పించడం.. ఊరికి ఉపకారం పేరిట ఉంపుడుగత్తెలను చేయడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా వచ్చింది. ఈ దురాచారాన్ని 1988లో రద్దు చేశారు. అయితే ఏడెనిమిదేళ్ల క్రితం వరకు యథేచ్ఛగా సాగిన ఈ జోగినీ వ్యవస్థ ఇప్పటికీ పలు చోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కాలంలో ఈ దురాచారం మళ్లీ పురుడుపోసుకున్నట్లు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దేవరకద్ర, ఊట్కూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రెండేళ్లుగా సుమారు 18 మందిని జోగినులుగా మార్చినట్లు సమాచారం. గత ఏడాది ఫిబ్రవరిలో దేవరకద్ర పరిధిలో ఓ విద్యావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిని జోగినిగా మార్చేందుకు ప్రయత్నించగా.. ఓ ఎన్జీఓ సంస్థ అడ్డుకోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇక జోగినుల జీవన భృతికి సంబంధించి ఒంటరి పింఛన్‌కు అర్బన్ ప్రాంతాల్లో 30 ఏళ్లు, గ్రామాల్లో 35 ఏళ్ల వయసు ఉన్న వారిని అర్హులుగా గుర్తించారు. కానీ పలు చోట్ల 20, 25 ఏళ్లు ఉన్న జోగిని మహిళలు ఒంటరి పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి ఈ వ్యవస్థ ఇంకా కొనసాగుతోందని ఎన్జీఓలు చెబుతున్నారు. అప్పట్లో నిజామాబాద్‌లో.. ఇప్పుడు పాలమూరులో ఎక్కువగా 1987–88లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24,273 మంది జోగినులు ఉన్నట్లు ఆనాటి ప్రభుత్వం గుర్తించింది. ఇందులో తెలంగాణలోనే 14,863 మంది జోగినులు ఉండగా.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 5,666 మంది ఉన్నట్లు తేలింది. ఇక 2013లో ఏక సభ్య కమిషన్ నివేదిక ప్రకారం తెలంగాణలో 12 వేల మంది జోగినులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల పరిధిలోని దేవరకద్ర, మహబూబ్‌నగర్, గద్వాల, గట్టు, ధరూర్, నారాయణపేట , ఊట్కూర్, మక్తల్, మాగనూర్, ధన్వాడ, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో సుమారు ఐదు వేల మందికి పైగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ఇక ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎనిమిది వేలకు పైగా జోగినులు ఉన్నట్లు ఎన్జీఓ సంస్థలు చెబుతున్నాయి. విద్యకు దూరం.. జోగినులుగా మారినమహిళలకు వివాహం ఉండదు.. కుటుంబం కుదరదు.. సొంత జీవితమంటూ ఉండదు.. ఎవరి ఆదరణకు నోచుకోకపోవడంతో వ్యభిచారంతో ఆరోగ్యం దెబ్బతిని ఇప్పటికే వందల సంఖ్యలో అకారణంగా మృత్యువాతపడ్డారు. 75 శాతం మేర జోగినుల వయసు పైబడడం, తండ్రి పేరు లేకపోవడంతో వారి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోకపోవడంతో ఉన్న వారు సైతం నిరక్షరాస్యులుగానే మిగిలారు. 2009లో తల్లిపేరుతో అవకాశం కల్పించినప్పటికీ.. పదో తరగతికి మించి ఒకట్రెండు కుటుంబాలు మినహా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాయి. దీనికి తోడు అమ్మాయిల సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఆడపిల్లలను వదిలించుకుందామనే ఉద్దేశంతో మొక్కు పేరిట జోగినిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా కుటుంబాలను చైతన్యం చేయడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఈ దురాచారాన్ని నిర్మూలించే అవకాశం ఉంది. జోగినులకు ప్రత్యేక చట్టం చేయాలి.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది జోగినులు ఉన్నారనే దానిపై సర్వే చేపట్టాలి. ఆ తర్వాత ఏపీలో చేసిన తరహాలో ప్రత్యేక చట్టం చేయాలి. గతంలో ఏకసభ్య కమిషన్‌కు సమర్పించిన డిమాండ్లను నెరవేర్చాలి. – హాజమ్మ, జోగిని నిర్మూలన హక్కుల పోరాట సమితి జిల్లా కన్వినర్ ప్రత్యేక బడ్జెట్.. జోగిని బంధు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా బడ్జెట్లో జోగిని సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3 కోట్ల బడ్జెట్ కేటాయించేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సంప్రదాయం అటకెక్కింది. దీన్ని కొనసాగించడంతోపాటు రాష్ట్రంలోని వివిధ కులాలకు ఉన్నట్లుగానే జోగినుల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని జోగినులు డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా ఒక్కో జోగిని కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని.. నివాసం కోసం ఉచితంగా స్థలంతో పాటు ఇల్లు కట్టించాలని కోరుతున్నారు. అదేవిధంగా దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు వలే జోగిని బంధు తీసుకొచ్చి.. ప్రతి ఒక్క జోగినికి స్వయం ఉపాధి నిమి త్తం రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. జోగినుల ఇతర డిమాండ్లు.. ♦ ప్రతి జోగినికి రూ.3 వేల భృతి ఇవ్వాలి. ♦ పదో తరగతి పాసైన జోగినిల పిల్లలకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. ♦ స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకులతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలి. ♦చదువుకునే జోగిని పిల్లలందరికీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రై వేట్ విద్యాలయాల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను బోధించాలి. డిగ్రీ ఆపై విద్యార్హత ఉన్న వారికి ఉన్నత ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦ 1988 జోగిని నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి. ♦ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కమిటీలో జోగినులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. గ్రామాల్లో ఉన్న ప్రతి జోగిని కుటుంబానికి ఆహారభద్రత కార్డు ఇవ్వాలి. -
కాలం మారిన ఆ వ్యవస్థ మారట్లేదు: విజయేంద్ర ప్రసాద్
Vijayendra Prasad Unveils Sharapanjaram First Song: గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది ? ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘శరపంజరం’. నవీన్ కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. లయ హీరోయిన్‌కు యాక్ట్ చేస్తున్నారు. నవీన్ కుమార్, టి. గణపతి రెడ్డి, మల్లిక్ ఎంవీకే నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ఫస్ట్ గ్లింప్స్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, 4 నిమిషాల వీడియోను మామిడాల హరికృష్ణ, దర్శకుడు వేణు ఊడుగుల రిలీజ్ చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కాలం మారినా కొన్ని చోట్ల జోగిని వ్యవస్థ లాంటి దూరాచారాలు కొనసాగుతున్నాయి. వాటిని రూపు మాపే క్రమంలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా 12 ఏళ్ల కల’’ అని పేర్కొన్నారు నవీన్ కుమార్ గట్టు. ‘‘మా సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు మల్లిక్, గణపతి రెడ్డి ఆశాభావం తెలిపారు. -
జోగినులు, బసివినులు.. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మగౌరవం దిశగా..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓ వ్యవస్థనే ప్రక్షాళనం చేస్తున్నాయి. తరతరాలుగా ఓ దురాచార చట్రంలో చిక్కుకుపోయిన మహిళామూర్తులకు విముక్తి కలిగించి.. వారికి సరికొత్త జీవన మార్గాన్ని చూపుతున్నాయి. ఊరి ఉమ్మడి ఆస్తిగా ఉన్న వారి అస్తిత్వం.. నేడు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఆత్మాభిమానాన్ని ప్రోది చేసుకుంటోంది. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మగౌరవం దిశగా అడుగులేస్తున్నారు. ఆధార్, రేషన్‌కార్డులు అందుకున్నారు. వైఎస్సార్ ‘ఆసరా’తో నిలదొక్కుకుంటున్నారు. వారి బిడ్డలు అమ్మ ‘ఒడి’లో ఓనమాలు దిద్దుకుంటూ సరికొత్త సూర్యోదయం దిశగా సాగుతున్నారు. సాక్షిప్రతినిధి అనంతపురం : ‘ఊళ్లో మీసమొచ్చిన ప్రతి మగాడికీ మా మీదే చూపు. మేమంటే ఊళ్లో మగాళ్లందరికీ ఉమ్మడి ఆస్తి అన్న భావన. మా ఇష్టాయిష్టాలతో పనిలేదు. వయసు తారతమ్యాలు అసలే లేవు. కాదు కూడదు అనడానికి వీల్లేదు. అదేమంటే.. మేము జోగినులం, బసివినులం. ఊరి మగాళ్లందరికీ సొంతమట.. అంటూ మొన్నటిదాకా తాము పడ్డ కష్టాలపై గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకర్గంలోని జోగినులు, బసివినులు. అయితే ఇప్పుడా పరిస్థితుల్లేవని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల పుణ్యమాని తమ కాళ్ల మీద తాము నిలబడుతూ, ఆత్మగౌరవంతో బతుకుతున్నామని చెబుతున్నారు. బసివిని, జోగిని వ్యవస్థ నుంచి పూర్తిగా బయటపడ్డామంటున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాటు.. సామాజిక పింఛన్, ఆసరా, డ్వాక్రా వంటి పథకాలు తమ సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని పూర్తిగా మార్చేశాయని సగర్వంగా చెబుతున్నారు. చదవండి: కోతకు గురైన నదీ గర్భం అభివృద్ధి.. క్షేత్రస్థాయిలో పరిశీలించాకే పథకాల పంట: సచివాలయం, వలంటీర్ వ్యవస్థల కారణంగా ప్రభుత్వ పథకాలు వారి ఇళ్ల ముంగిట్లోకే చేరుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గంలోని జోగినులు, బసివినులందరికీ ఆధార్, రేషన్కార్డులొచ్చాయి. బసివిని లోన్ కింద పలువురికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందింది. 391 మంది జోగినులకు, 151 మంది బసివినులకు ఇప్పటి వరకూ పక్కా గృహాలిచ్చారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరు దాదాపుగా వ్యభిచారం వైపు వెళ్లడం లేదు. మిగతా మహిళల్లానే సమాజంలో హుందాగా బతకాలని కోరుకుంటున్నారు. బసివినులు, జోగినుల కుటుంబాల్లో 1,456 మంది చిన్నారులున్నారు. అయితే వారి పిల్లలను ఈ వ్యవస్థలోకి రానియ్యకుండా ఆపగలిగారు. పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. చదవండి: సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు పింఛన్ వస్తోంది.. నాకు పదేళ్లకే దేవుడి దగ్గర పెళ్లి చేశారు. ఆ తర్వాత నేను బసివిని అయ్యాను. పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డల తల్లినయ్యాను. నా కూతురు చదువుకు వెళితే తండ్రి పేరు చెప్పలేకపోయా. ఇప్పుడు ఒంటరి మహిళ కింద పింఛన్ వస్తోంది. దానికి తోడు కష్టపడి పనిచేసుకుంటున్నా. నా పిల్లలను ఆ దురాచారం నుంచి రక్షించుకున్నా. – మీనాక్షి, బసివిని, బొమ్మనహాళ్ నన్ను దేవుడికి వదిలేసి జీవితం లేకుండా చేశారు నన్ను ఎనిమిదేళ్ల వయసులోనే దేవుడికి వదిలేశారు. దేవుడికి వదిలేయడం పేరుకే గానీ, ఊరికి వదిలేయడం అన్న మాట. ఇప్పుడు నేను వృద్ధురాలిని అయ్యాను. పింఛన్ వస్తోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేశా. – సుంకమ్మ, బొమ్మనహాళ్ మహిళాభ్యున్నతే అజెండాగా.. మహిళాభ్యున్నతే ఈ ప్రభుత్వం ప్రధాన అజెండా. జోగిని, బసివిని వ్యవస్థ నుంచి వారు బయటపడేలా ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చూస్తున్నాం. మహిళలు నిలదొక్కుకుంటేనే కుటుంబం బావుంటుందనేది సీఎం వైఎస్ జగన్ అభిలాష. వారికి మెరుగైన జీవితాన్నిచ్చేందుకు ప్రభుత్వం తరఫున అన్నీ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో అనాదిగా ఉన్న ఈ దురాచారం త్వరలోనూ పూర్తిగా అంతమవుతుందని ఆశిస్తున్నా. – బోయ గిరిజమ్మ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, అనంతపురం మండలాల వారీగా జోగినులు, బసివినులు మండలం జోగినులు బసివినులు బొమ్మనహాళ్ 60 67 డి.హీరేహాళ్ 27 67 గుమ్మఘట్ట 242 02 కణేకల్లు 37 34 రాయదుర్గం 89 09 మొత్తం 455 179 -
ఈ రొంపి ఇంకెన్నాళ్లు?
-
కదిలిస్తే కన్నీళ్లే.. ఈ రొంపి ఇంకెన్నాళ్లు!
-
కదిలిస్తే కన్నీళ్లే.. ఈ రొంపి ఇంకెన్నాళ్లు!
సాక్షి, అమరావతి: అభం శుభం తెలియని బాలికలను బలవంతంగా దేవదాసీ వృత్తిలోకి దింపుతున్నారు. వారు దేవుడికి సేవ చేయాలన్న కారణం చూపి.. లైంగిక వాంఛ తీర్చుకుంటున్న దారుణాలు నేటికీ ఎన్నో జరుగుతున్నాయి. జోగిణి, బసివిణి, దేవదాసి, మాతంగి.. ఇలా పేరు ఏదైనా జరిగేది మాత్రం లైంగిక దోపిడీయే. మొదట.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓ బాలికను ఎంచుకుంటారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులకు పొలం ఇస్తామంటారు. లేదంటే ఇంటి స్థలమో, లేదంటే అనారోగ్యాన్ని కారణంగా చూపుతారు. అమ్మవారు పట్టిందని అంటారు. దేవుడికి జీవితాన్ని అంకితం ఇవ్వాలని ఇది సంప్రదాయమని ఎప్పటినుంచో వుందని అంటారు. జోగిని, బసివిని, మాతంగి, దేవదాసి, పార్వతి, పద్మావతి ఇలా ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో ఈ దురాచారం కొనసాగుతోంది. ఇలా పలు కారణాలతో ఈ రొంపిలోకి అమాయక ఆడ పిల్లలను దింపుతున్నారు. దేవుడు పేరు చెప్పి దెయ్యాల్లాంటి మనుషులు లొంగదీసుకుంటున్నారు. ఆడపిల్లల్ని ఆటవస్తువులుగా మార్చి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది. ఈ ఆధునిక యుగంలో కూడా ఈ దురాచారం కొనసాగుతోందా అని ఆశ్చర్యపోతున్నారా?. నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలోనే కాదు కర్నూలు, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లోనూ ఈ విష సంస్కతి ఇంకా కొనసాగుతోందనడానికి ఈ అమాయక మహిళల గోడే నిదర్శనం. -
జోగిని శ్యామల తాజా డిమాండ్స్
సాక్షి, హైదరాబాద్: సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఆర్చిగేటు, దేవాలయం ప్రధాన ద్వారం వద్ద బోనంతో వెళుతున్న తనతో పాటు తన బృందాన్ని అడ్డుకోవడంతో మనస్థాపం చేందానని, అందుకే అలా మాట్లాడానని జోగిని శ్యామల వివరణ ఇచ్చారు. తాను ప్రభుత్వాన్ని నిందించాలనేది తన ఉద్దేశం కాదని, అక్కడున్న అధికారుల తీరుతో వారిని ఉద్దేశించి మాట్లాడానన్నారు. మంగళవారం ఆమె దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తలపై బోనాలు పెట్టుకుని శివసత్తులు డ్యాన్సులు చేస్తూ భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనాల సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతారన్నారు. తాను అనని మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించి ముఖ్యమంత్రి తదితరులను ఉద్దేశించి అన్నట్లు చూపిస్తుండడం బాధకలిగించిందన్నారు. రాబోయే రోజుల్లో శివసత్తులందరికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడంతో పాటు, శివసత్తులు ఏ దేవాలయానికి వెళ్లినా అమ్మవారి సన్నిధికి వెళ్లేలా ప్రత్యేక జీఓ చేయాలని ఆమె కోరారు. శివసత్తులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి తప్పు జరగలేదు: ఈఓ అన్నపూర్ణ జోగిని శ్యామల విషయంలో దేవాలయం నుంచి ఎలాంటి తప్పు జరగలేదని ఈఓ అన్నపూర్ణ తెలిపారు. శ్యామలతో పాటు వచ్చిన వీఐపీలు అందరికి దేవాలయ సంప్రదాయం ప్రకారం పూజలు చేయించి పంపించామన్నారు. ఈ సంవత్సరం 1008 బోనాలతో కలిసి వచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ప్రపంచ రికార్డుగా వివరించారు. ఇంత పెద్ద జాతరలో చిన్నచిన్న తప్పులు జరిగి ఉండవచ్చని, భక్తులు పూర్తిగా సహకరించారన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్ అరుణగౌడ్ ప్రత్యేక శ్రద్ధతో అన్ని శాఖల అధికారులను సమన్వయంతో ఏర్పాట్లు చేశారన్నారు. సంబంధిత కథనాలు: తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుందాం
సాక్షి, మక్తల్ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వై రత్నం, కేఎన్పీఎస్ రాష్ట్ర నాయకుడు డి.చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఎస్ పంక్షన్హాల్లో కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మొదటి మహసభలో వారు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను చేయాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు దాటుతున్నా ఇంకా ప్రజలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పీడిత కులాల మహిళలను అవమానించే రీతిలో జోగిని, బస్వినీలుగా మార్చే సంస్కృతి నుంచి బయట పడాలని సూచించారు. తెలంగాణ వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని, మైనార్టీలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం విలువలను కాపాడాటానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కెఎన్పీఎస్ రాష్ట్ర నాయకులు భూరం అభినవ్, రాములు, బండారి నర్సప్ప, రమేష్, లింగన్న, కృష్ణ, శ్రీదేవి, రాంచందర్, మద్దిలేటి, వామన్, మున్వర్‌అలీ, బండారి లక్ష్మణ్, వెంకటేస్ తదితరులు పాల్గొన్నారు. -
వీడని నీడ
జోగినీ వ్యవస్థ ప్రభావం ఇంకా సమాజాన్ని వేధిస్తూనే ఉంది! ఈ దుర్వ్యవస్థ, దురవస్థ మూలాలు మిగిలే ఉన్నాయి. జోగినీ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు కొద్ది మేర ఫలితాలు ఇస్తున్నప్పటికీ పేదరికం, మూఢత్వం ‘జోగిని’ని పూర్తిగా రూపు మాపలేక పోతున్నాయి. ఇప్పటికే జోగినీలుగా ఉన్నవారికి ఉపాధి చూపడంతో పాటు కొత్త వారు రాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు లేకపోవడంతో జోగినీ వ్యవస్థ నిర్మూలన జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 వేల మంది జోగినీలు వివిధ పేర్లతో ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. దానికితోడు వ్యవస్థలోకి కొత్తవారు రావడం మరింత ఆవేదన కలిగించే విషయం. దెప్పి పొడుపులు : శ్యామల కథ కామారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన శ్యామల (పేరు మార్చాం) కష్టాన్ని వింటే మనుసున్న వారెవరికైనా కళ్లు చెమరుస్తాయి. శ్యామల ఐదేళ్ల ప్రాయంలో ఉండగా అనారోగ్యానికి గురైంది. ఆమె కుటుంబంలో జోగినీ ఆచారం ఉందని, మొక్కుకుంటే నయం అవుతుందని కొందరు సలహా ఇవ్వడంతో శ్యామలను జోగినీగా మారుస్తామని దేవునికి మొక్కుకున్నారు. దేవత అనుగ్రహం వల్లే బతికిందని నమ్మిన తల్లిదండ్రులు పసి వయసులోనే ఆమెను జోగినీగా మార్చారు. అయితే కుటుంబంలో అన్నలతో కలిసి చదువుకున్న శ్యామల ఉన్నత చదువులపై దృష్టి పెట్టింది. ఇటీవల శ్యామల సోదరులు ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచనకు వచ్చారు. బంధువులతో పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు. ఇంతలోనే శ్యామల తండ్రి అనారోగ్యానికి గురికావడంతో శ్యామల కుటుంబసభ్యులు పెళ్లి ఆలోచన విరమించారు. దేవతతో పెళ్లి చేసిన శ్యామలకు మళ్లీ పెళ్లి చేస్తే అరిష్టమని, అందుకే తండ్రి అనారోగ్యం పాలయ్యాడని శ్యామల బంధువులు శ్యామలను ఇప్పుడు దెప్పిపొడుస్తున్నారు. వెంటాడే గతం : మమత వ్యథ నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలానికి చెందిన మమత (అసలు పేరు కాదు)ది మరో దీనగాథ. వీళ్ల కుటుంబంలో తరతరాలుగా జోగినీ దురాచారం కొనసాగుతోంది. వీరి తల్లిదండ్రులకు పిల్లలు పుట్టగానే చనిపోవడంతో మమత పుట్టగానే జోగినీగా మారుస్తామని వారు మొక్కుకున్నారు. అందులో భాగంగానే చిన్నతనంలోనే మమతను జోగినీగా మార్చారు. అయితే దురాచారానికి ఎదురు నిలిచిన మమత పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తోంది. అయితే పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అప్పటికే పెళ్లయిన మేనబావతో సహజీవనం చేస్తోంది. ప్రస్తుతం మమతకు ఇద్దరు పిల్లలు. టైలరింగ్ చేస్తూ చదువు ఖర్చులు భరిస్తూ జీవనం సాగిస్తోంది. సమాజానికి ఎదురు నిలిచి సొంతకాళ్లపై నిలబడ్డ మమతను దురాచారపు ఆనవాళ్లు అడుగడుగునా వెంటాడుతున్నాయి. అమలుకాని సిఫారసులు జోగినీ వ్యవస్థను రూపుమాపడానికి చేపట్టే చర్యల్లో భాగంగా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం వి.రఘునాథ్‌రావ్ కమిషన్‌ను నియమించింది. ఆ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ నివేదిక ఇచ్చింది. అయితే నివేదికలోని సూచనలు ఎక్కువ భాగం అమలుకు నోచుకోలేదు. జోగినీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం చేపట్టిన చర్యలు లేవు. జోగినీల పిల్లలకు ఉద్యోగాలు కల్పించే విషయాన్ని పూర్తిగా విస్మరించారు. దానికి తోడు జాతరలు, గ్రామ దేవతల ఉత్సవాలు జరిగినపుడు జోగినీల నృత్యాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చే చర్యలు కావాలిప్పుడు. మాలెక్క మా పిల్లలు కావొద్దు నాకు పదకొండేండ్లకే దేవునితో పెండ్లి చేసి జోగినీగా మార్చిండ్రు. మస్తు కష్టాలు ఎల్లదీసినా. ఎన్నో అవమానాలు ఎదురైనయి. నాకు ఇద్దరు ఆడ పిల్లలు. పిల్లలకు తండ్రి ఎవరంటే ఏం చెప్పుతం సార్. అప్పుడే రాజయ్య సార్ మా దగ్గరికి వచ్చిండు. మాకు ధైర్యం చెప్పిండు. హేమలత మేడం, లవణం సార్లతో కలిసి ఢిల్లీదాకా పోయినం. మాకు న్యాయం జరగాలని తిరిగినం. నాలెక్క ఎంతో మంది జోగినీలు పడుతున్న కష్టాల నుంచి బయట పడేయడానికి రాజయ్య సార్ తో కలిసి ఊరూరు తిరిగి అందరినీ కూడగట్టినం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినం. అప్పుడు జోగినీలకు రూ.1,500 పింఛన్, మూడెకరాల భూమి ఇయ్యాలన్నారు. నాకు, నాతోటోళ్లకు ఎకరం చొప్పున మాత్రమే భూమి వచ్చింది. మూడెకరాలు ఇయ్యలేదు. పింఛన్ కూడా రాకుండే. ఒంటరి మహిళల పింఛన్ కింద రూ. వెయ్యి ఇస్తున్నరు. మాలెక్క మా పిల్లలు అన్నాయం కావద్దనుకుని వాళ్లకు సదువు చెప్పిచ్చినం. పిల్లలు చదువుకున్నరు. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నరు. ప్రభుత్వం జోగినీలకు పింఛన్లు ఇయ్యాలె. భూములు ఇయ్యాలె. పిల్లలకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలె. బతుకుదెరువు ఉంటే అందరితో కలిసిపోతరు. ఈ కష్టాలు పోతయి. – కామవ్వ, జోగినీ, బొమ్మన్‌దేవ్‌పల్లి, నస్రుల్లాబాద్ పిల్లలకు ఉద్యోగం కల్పించాలి జోగినీలుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం. ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. మేం కొంత అవగాహన వచ్చిన తరువాత మాలాంటి వాళ్లను చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే చాలా మంది మాకు బతుకుదెరువు లేదంటున్నారు. భూములు లేవు. ఉపాధి లేదు. దీంతో చాలామంది ఇప్పటికీ శవయాత్రల్లో నాట్యం చేస్తున్నరు. చాలా మందికి ఇండ్లు కూడా లేవు. తినడానికి తిండి దొరక్క ఎంతో మంది కష్టాలు పడుతున్నరు. జోగినీల పిల్లలకైనా కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. ప్రభుత్వానికి అప్పట్లో రఘునాథ్‌రావ్ కమిషన్ జోగినీలకు భూములు ఇవ్వాలని చెప్పినా, ఎక్కడా సరిగా ఇవ్వలేదు. భూమి లేదు, ఇల్లు లేదు. చేయడానికి పనులు కూడా లేవు. బతకడం కష్టంగా ఉంది. అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తద్వారా దురాచారాన్ని నిర్మూలించవచ్చని మేం గూడా కలెక్టర్‌ను కలిసి విన్నవించినం. ప్రభుత్వం ఆలోచన చేయాలె. – పద్మ, జోగినీ, నాగిరెడ్డిపేట ఆర్థికంగా బలోపేతం చేయాలి జోగినీ వ్యవస్థను నిర్మూలించాలని మేం దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాటం చేశాం. రఘునాథరావ్ కమిషన్ వేసిండ్రు. కమిషన్ ఇచ్చిన సిఫారసులు ఇప్పటికీ అమలు కావడం లేదు. కొందరికి ఎకరం చొప్పున భూములు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. జోగినీలుగా ముద్రపడిన అందరికీ భూములు ఇవ్వాలి. వాటిని అభివృద్ది చేసుకోవడానికి సాయం చేయాలి. వారి పిల్లల చదువులకు సాయం అందించాలి. ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. ఆర్థికంగా వారు కష్టాలను అధిగమిస్తేనే ఈ దురాచారాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించవచ్చని ప్రభుత్వానికి సూచించాం. ఇటీవల ఎంపీ కవితను కలిసి విన్నవించాం. మేం నాలుగైదు జిల్లాల్లో తిరిగి సర్వే చేస్తున్నాం. కొత్తగా కూడా జోగినీలు తయారవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. – రాజన్న, సంఘ వికాస స్వచ్ఛంద సంస్థ చైర్మన్ – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
ఓ రాధిక అంతరంగం
జో...గి...ని... ఈ పదం అంటేనే ఒక రకంగా చూస్తారు. అసలు వాళ్లు బాహ్యప్రపంచంలోకి రావడమే బాగా అరుదు. కేవలం ఉత్సవాల సమయంలో మాత్రమే వాళ్లు బయట కనపడుతుంటారు. కానీ, ఒక జోగిని బయటకు వచ్చి కెమెరా ముందు నిలబడి తన అంతరంగాన్ని వెల్లడించడం ఒకరకంగా పెద్ద సాహసమే. జోగిని రాధిక ఆ సాహసం చేసింది. 'సాక్షి' స్టూడియోకు వచ్చి.. తామేంటో.. తమ బతుకేంటో.. ఏం అవుదామనుకుంటున్నామో చెప్పింది. ఆమె చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. ''ఇది ట్రెడిషన్ కాదు.. కుటుంబం ఆచారంలా రాదు. జోగినిలు పెళ్లి చేసుకోరు. నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. నాకు పదేళ్ల సమయంలో అమ్మవారు వచ్చారు. అప్పుడు ఆలయాలకు తీసుకెళ్లినా పెద్దగా మార్పులేదు. దేవుడికి అనుబంధంగా పెడితే బాగుంటుందనిపించి అలా చేశారు. బోనాల పండగలో జోగినికి చాలా ప్రత్యేకత ఉంది. బోనం జోగినితో చేయించడం వల్ల పవిత్రత ఉంటుందని భావిస్తారు. అన్ని ఆలయాలకూ పిలుస్తారు. గోల్కొండలో మొదటి బోనాలు మొదలవుతాయి. తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, తర్వాత మహంకాళి, ఆ తర్వాత లాల్ దర్వాజ ఆలయాల్లో జరుగుతాయి. అమ్మవారికి తొలిబోనం మేమే సమర్పిస్తాము. కొన్ని ఇళ్లల్లో కూడా జోగినిలతో బోనం ఇప్పిస్తే మంచిదని భావించేవాళ్లు ఉంటారు. జిల్లాల్లో కొన్నిచోట్ల జోగినులు చాలా సమస్యలు అనుభవిస్తున్నారు. ఏడాదికోసారి ఉత్సవాల సమయంలోనే పూజకు పరిమితం అవుతారు. హైదరాబాద్‌లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పూజలు, దేవుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మేం ఉంటాం. జోగినికి పూనకం వస్తుందని, దేవుడితో సంబంధం ఉంటుందని చెప్పడం వల్ల మాపై కొంత గౌరవం ఉంటుంది. గ్రామాల్లో మాత్రం వీళ్ల పరిస్థితి అంత బాగోలేదు. ఈ పరిస్థితిపై శ్యామల ఇప్పటికే ఓ సినిమా తీశారు. జోగినులు పెళ్లి చేసుకోరు. అయినా గ్రామాల్లో మాత్రం పటేళ్లు, పట్వారీలు వీళ్లని దోచుకుంటారు. అలాంటప్పుడు వాళ్లకు పుట్టే పిల్లలకు తండ్రులు ఉండరు. అలాంటప్పుడు వాళ్లు బయటకు వెళ్తే, జోగిని పిల్లలు అంటూ తిరస్కరిస్తారు. అదే నగరాల్లో అయితే.. ఎవరు ఎవరో తెలియదు. దాంతో పిల్లల పరిస్థితి కూడా కొంత మెరుగ్గానే ఉంటుంది. కొంతమంది నవ్వేవాళ్లు ఉంటారు. ఆదరించేవాళ్లు ఉంటారు. సిటీలో అలాంటి సమస్యలు ఏమీలేవు. ఇలాంటి సమస్యల మీద శ్యామల లాంటివాళ్లు పోరాటం చేశారు. ఏదైనా ఒకచోట ఉన్న సమస్యలపై మేం పరిశోధన చేసినంత మాత్రాన సరిపోదు. తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కూడా చర్యలు తీసుకోవాలి. ఈ వృత్తిలో ఉన్నవాళ్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. పూజల విషయంలో కూడా కాంట్రవర్సీ ఎక్కువ. ఏ పని చేసినా ఎవరో ఒకరు రోల్ మోడల్ గా ఉంటారు కదా. వాళ్లు అలా చేస్తున్నారు, మీరలా చేస్తున్నారని అంటారు. మా ఉపాధి విషయానికి వస్తే.. ఘటాలు చేస్తున్నప్పుడు... తృప్తి మేరకు ఇస్తారు, వడిబియ్యం పోస్తారు. అమ్మవారికి పూజ చేసేవాళ్లు తప్పకుండా మమ్మల్ని పిలుస్తారు. ఈ వ్యవస్థను బాగు చేయాలనే నాకూ ఉంది. అందుకోసం ప్రతి ఊరుకి వెళ్లాలి, కౌన్సెలింగ్ చేయాలి. ఈ వ్యవస్థను నేను ఎంకరేజ్ చేయను. నేను జోగినిగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో చెబుతాను. సీనియర్ జోగినిలు మీరు ఇలాగే ఉండాలి, మేం చెప్పినట్లు చేయాలి అంటారు. నేను ఘటం ఎత్తుకున్నప్పుడు టీవీలో చూపిస్తే అది నా తప్పు కాదు కదా. ఇలాంటి వాటిని వాళ్లు తప్పుపడతారు. ఇలా ఎందుకు రెడీ అవుతారని అడుగుతారు. అమ్మ ఆవహించినప్పుడు.. పూనకం వచ్చినప్పుడు ఏమవుతుందో నాకూ తెలియదు. నాలాంటివాళ్లకు సాయం చేయాలని ఉంది.''