మార్చిలో మొదలు? | Mahesh Babu And Rajamouli Film Will Be A Forest Adventure Movie Starts In March 2024 - Sakshi
Sakshi News home page

Mahesh Babu-Rajamouli Movie Update: మార్చిలో మొదలు?

Published Tue, Oct 10 2023 5:42 AM | Last Updated on Tue, Oct 10 2023 9:34 AM

Mahesh-Rajamouli film Will Be A Forest Adventure movie starts in march 2024 - Sakshi

‘గుంటూరుకారం’ సినిమాతో బిజీగా ఉన్నారు హీరో మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో మహేశ్‌ చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అయితే దర్శకుడు రాజమౌళితో మహేశ్‌ బాబుకు ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్ష¯Œ  డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ కథ ఓ కొలిక్కి వచ్చిందని, మార్చిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలు పెట్టేలా రాజమౌళి అండ్‌ కో ప్రణాళికలు రచిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement