Mahesh Rajamouli Movie Update K Vijayendra Prasad - Sakshi
Sakshi News home page

Mahesh Rajamouli Movie: మహేశ్-రాజమౌళి మూవీ క్లైమాక్స్ అలా!

Published Sun, Jun 25 2023 3:42 PM | Last Updated on Sun, Jun 25 2023 5:22 PM

Mahesh Rajamouli Movie Update K vijayendra Prasad - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి సినిమా షూటింగే ఇంకా మొదలవలేదు. అప్పుడే వరసపెట్టి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. స్వయానా రాజమౌళి తండ్రి, ఈ చిత్ర రచయిత కే విజయేంద్ర ప్రసాద్ వీటిని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పేశారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

'ఆర్ఆర్ఆర్' సినిమాకి ఆస్కార్ రావడం మాటేమో గానీ డైరెక్టర్ రాజమౌళి రేంజు ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో తన నెక్స్ట్ మూవీ విషయంలో ఏ మాత్రం తొందరపడకుండా చాలా కూల్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ లాంచింగ్ ఉందని అంటున్నారు. మరోవైపు రైటర్ విజయేంద్ర ప్రసాద్.. జూలై కల్లా స్క్రిప్ట్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. 

(ఇదీ చదవండి: ప్రభాస్‌దే అసలైన సక్సెస్.. కమల్‌తో పాత వీడియో వైరల్)

'జూలైలోపు స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తాను. ఆ తర్వాత దాన్ని రాజమౌళికి అందజేస్తాను. ఈ సినిమా క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ గా వదిలేస్తున్నా. కుదిరితే దీనికి సీక్వెల్ తీసుకోవచ్చు. అందుకు తగ్గట్లే సీన్స్ రాస‍్తున్నా. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. 

గతంలోనే రాజమౌళి, మహేశ్ తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది గ్లోబ్ ట్రొటింగ్ సినిమా అని అన్నారు. అడ్వెంచరస్ తరహా స్టోరీ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇలా రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ మాటలు బట్టి చూస్తుంటే ఇది ఇండియానా జోన్స్ తరహా జంగిల్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. రిలీజ్ మాత్రం కచ్చితంగా మరో మూడు-నాలుగేళ్ల తర్వాతే. ఎందుకంటే అక్కడున్నది ఎవరు.. రాజమౌళి! 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement