
తండ్రి కథలు ఇస్తుంటారు... రాజమౌళి మాటలు ఇచ్చారు!
దర్శకుడు రాజమౌళి చిత్రాలకు ఆయన తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ కథలు రాస్తుంటారు. తండ్రి దగ్గర కథలు తీసుకునే రాజమౌళి, ఇప్పుడు తండ్రికి మాటలు ఇచ్చారు. అంటే... ఆయన డైలాగులు ఏం రాయలేదు. తండ్రి సినిమా కోసం కొన్ని డైలాగులను చెప్పారు. అంటే.. వాయిస్ ఓవర్ ఇచ్చారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ‘శ్రీవల్లి’కి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ‘‘ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగంతో ఆమెకు గత జన్మ స్మృతులు గుర్తుకువస్తాయి. అప్పుడామె జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయ న్నది ఆసక్తికరం. ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. రాజీవ్ కనకాల, సత్యకష, హేమ నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్. శ్రీలేఖ.