
మాట సాయం!
రాజమౌళి తీసే సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ ఇస్తారు. తనకెలాంటి కథలు కావాలో తండ్రికి రాజమౌళి చెబితే, ఆయన వెంటనే కథ రాసిచ్చేస్తారు. తండ్రి అంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు కాబట్టే, ఆయన తీసిన సినిమాకి తన వంతుగా ఏదైనా చేయాలని రాజమౌళి అనుకుని ఉంటారు. అందుకే మాట సాయం చేశారు.
అదేనండీ... విజయేంద్ర ప్రసాద్ తీసిన తాజా చిత్రం ‘శ్రీవల్లీ’కి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఈ సినిమాలోని పాత్రలను రాజమౌళి పరిచయం చేస్తారట. కచ్చితంగా ఈ వాయిస్ సినిమాకి ఓ హైలైట్ అనొచ్చు. రజత్, నేహా హింగే జంటగా సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది.