Sanketh Dharma Chakram 2022 Movie Opening, Deets In Telugu - Sakshi
Sakshi News home page

Dharma Chakram 2022: అలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు: హీరో

Published Tue, Jul 5 2022 4:15 PM | Last Updated on Tue, Jul 5 2022 5:29 PM

Sanketh Dharma Chakram 2022 Movie Opening - Sakshi

Dharma Chakram 2022 Movie: సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ హీరో హీరోయిన్లుగా నాగ్ ముంత దర్శకత్వంలో.. జీపీ రెడ్డి నిర్మాతగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ‘ధర్మచక్రం’. ఇటీవలె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వినూత్న కథ కథనాలతో రాబోతున్న ఈ మూవీ ప్రారంభోత్సవంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా.. రాజశేఖర్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. ఎం శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.

‘సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల మీద ఈ కథను దర్శకుడు రాసుకున్నారు. ఆయన చెప్పిన కథాకథనాలు నచ్చి.. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాను’ అని నిర్మాత జీపీ రెడ్డి తెలిపారు. దర్శకుడు నాగ్ ముంత మాట్లాడుతూ.. ‘ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాలు రోజూ చూస్తుంటాం. ఆడవాళ్లకు స్వీయ సంరక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. హీరోయిన్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నిర్మాత జీపీ రెడ్డికి కథ చెప్పిన వెంటనే నచ్చడంతో.. ఈ సందేశాత్మక చిత్రాన్ని చేద్దామన్నారు. సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

చదవండి: చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ?

‘నిర్భయ, దిశ ఘటనలాంటివి మనం చూశాం. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. నేను ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. మీ ఆశీర్వాదం లభిస్తే ఇంకా మంచి మంచి పాత్రలను పోషించగలను’ అని తెలిపారు హీరోయిన్‌ మోనిక చౌహాన్‌. హీరో సంకేత్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు మంచి కథను చెప్పారు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. మంచి సందేశంతో మీ ముందుకు రాబోతున్నాం. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’ హీరో సంకేత్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement