Sri Kalahasti
-
కన్నప్పకి శ్రీకారం
విష్ణు మంచు తన కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తిలో ఈ సినిమాని ప్రారంభించారు. స్టార్ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’కి దర్శకత్వం వహిస్తారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపుర్ సనన్ కథానాయిక. విష్ణు మాట్లాడుతూ– ‘‘భక్త కన్నప్ప, ఆయన భక్తి గొప్పతనాన్ని ‘కన్నప్ప’ ద్వారా ఈ తరానికి తెలియజేయాలన్నది మా సంకల్పం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ మూవీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ నటీనటులు నటిస్తారు. త్వరలో షూటింగ్ ఆరంభించి ఒక్క షెడ్యూల్లోనే పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాసి. -
శ్రీకాళహస్తిలో అశేష భక్తజన నడుమ రథోత్సవం (ఫొటోలు)
-
గ్రహణం వేళ ఆ ఆలయానికి పోటెత్తిన భక్తులు
సాక్షి, చిత్తూరు: సూర్యగ్రహణం సందర్బంగా దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలను శాస్త్రోకంగా మూసివేస్తారు. కానీ చిత్తూరు జిల్లాలోనికి శ్రీకాళహస్తి ఆలయం యథావిధిగా తెరుచుకొని ఉంటుంది. గ్రహణం వేళ ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయి. గురువారం సూర్యగ్రహం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఉదయం నుంచే యథావిధిగా పూజలు కొనసాగాయి. దీంతో ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజల్లో పాల్గొంటున్నారు. ఇది శుభ పరిణామం అని పూజారులు అంటున్నారు. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారన్నది అందరికీ తెలిసినా...తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం మాత్రం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. శ్రీకాళహస్తితోపాటు పిఠాపురం పాదగయ క్షేత్రంలోనే భక్తులు దర్శించుకునే వీలుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. పూర్వకాలం నుంచి ఈ పద్ధతిని పాటిస్తూ వస్తున్నామని వెల్లడించారు. -
ఆటో, ఆర్టీసీ బస్సు ఢీ: ఇద్దరు మృతి
సాక్షి, శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలంలోని వేంపల్లి వద్ద ప్రయాణికుల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులను నర్సప్పనాయుడు, వెంకటాచలపతిగా గుర్తించారు. -
శ్రీకాళహస్త్రిలోని ఓ గుడిలో చోరీ
-
తెలుగు తమ్ముళ్లు విడిపోయారు
శ్రీకాళహస్తి: తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. శ్రీకాళహస్తి టీడీపీ వర్గంలో చీలిక కనిపించింది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి రాజీనామా చేయాలంటూ మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీనికి ఓ వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు. కొందరు ఛైర్మన్ రాధారెడ్డి వ్యతిరేక టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
వృద్ధుల పించన్ కష్టాలు
-
శివయ్యా.. బంగారుబల్లిని చూపవయ్యా
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బల్లి శిల్పం ఉన్నట్టు పదేళ్ల కిందట గుర్తించారు. వెండి తొడుగు అమర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆ తర్వాత భక్తులు సమర్పించిన బంగారు తొడుగును అమర్చారు. అయితే గత ఏడాది విజయదశమి సందర్భంగా స్వామి దర్శన క్యూలను మార్పు చేశారు. దీంతో బంగారు బల్లి దర్శనానికి భక్తులు దూరమయ్యారు. అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: బంగారు బల్లిని తాకితే బల్లిపడటం వల్ల కలిగే అనర్థాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే కంచి ఆలయాన్ని దర్శించే భక్తులు ఖచ్చితంగా అక్కడి బంగారు బల్లిని స్పర్శించి తరిస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజస్తంభానికి పక్కనే పైకప్పుకు అమర్చిన రాళ్లపై బల్లి శిల్పం ఉన్నట్టు పదేళ్ల్ల కిందట గుర్తించారు. దీనికి తొలుత వెండి తొడుగును, ఆ తర్వాత బంగారు తొడుగును అమర్చారు. ఇక్కడే ఆ భాగ్యం కలగడంతో కంచికి వెళ్లలేని భక్తులు ఎంతో సంతోషించారు. అయితే ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రస్తుతం భక్తులకు బల్లిని తాకే భాగ్యం కరువవుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనమే కాకుండా అనేక దర్శనీయ ప్రదేశాలున్నాయి. వాటిలో బంగారుబల్లి ఒకటి. స్వామి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద ఆలయ పైకప్పులో రాతి బండపై బల్లి రూపాన్ని చెక్కారు. పదేళ్ల్ల క్రితం ఆలయాధికారులు గుర్తించి వెండి తొడుగును అమర్చారు. భక్తులకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక నిచ్చెన ఏర్పాటు చేశారు. 2010 ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన భక్తులు బంగారు తొడుగును విరాళంగా అందజేశారు. దీంతో వెండి తొడుగు స్థానంలో బంగారు తొడుగు అమర్చారు. శరీరంపై బల్లి పడిన వారే కాకుండా, దోష నివారణ కోసం ఆలయానికి వచ్చే భక్తులు బంగారు బల్లిని తాకేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన విజయదశమి పండుగ సందర్భంగా స్వామివారి దర్శనానికి ఉన్న క్యూలను మార్పు చేశారు. బంగారుపల్లి వద్దకు వెళ్లకుండా గేట్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బంగారుబల్లి దర్శనం భక్తులకు కరువైంది. దీంతో స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బంగారుబల్లిని దర్శించే వీలులేక అసంతృప్తిగా వెనుదిరుగుతున్నారు. బంగారుబల్లిని తాకే అవకాశం కల్పించాలి శివయ్య సన్నిధిలో ఉన్న బం గారుబల్లిని దర్శించి, తాకేం దుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. బంగారు బల్లిని తాకితే దోషాలు నివారణ అవుతాయన్నది గట్టి విశ్వా సం. అయితే ఆధికారులు బల్లిని తాకే అవకాశం కల్పించలేదు. దీంతో అసంతృప్తిగా వెళుతున్నాం. - సంధ్య, హైదరాబాద్ పరిశీలించి భక్తులకు అవకాశం కల్పిస్తాం ఆలయంలో బంగారుబల్లిని దర్శించుకునే అవకాశం ఎప్ప టి నుంచో ఉంది. ఏడాది క్రితం క్యూను సవరించిన దృష్ట్యా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ప్రత్యేకంగా ఏ ర్పాటు చేసిన నిచ్చెనను తొల గించారు. పరిశీలించి మళ్లీ బంగారుబల్లిని తాకే సదుపాయం కల్పిస్తాం. - శ్రీరామచంద్రమూర్తి, ఈవో -
దళారుల దందా
=నేతిదీపాల పేరుతో శఠగోపం =రూ.200 నుంచి 300 వరకు వసూలు =మసిబారిన వినాయక ఆలయం శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల దందా అధికమైంది. మాయమాటలతో భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా నేతిదీపాల పేరుతో రెం డుచేతులా సంపాదిస్తున్నారు. ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీకాళహస్తి ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే సమయంలో ఆలయం లో దళారుల సంఖ్య అధికమైంది. ఆలయంలో నేతిదీపాల కాంట్రాక్టు కాలపరిమితి ముగిసి ఏడా ది అవుతోంది. ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు అప్పటి దేవదాయశాఖ కమిషనర్ బలరామయ్య ప్రకటించారు. దీనిపై కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిళ్లు ఎక్కువైనా ఆలయాధికారులు తలొగ్గలేదు. కార్తీక మాసంలో మాత్రం సుపథ మండపంలో దీపాలు వెలిగించేందుకు అనుమతిచ్చారు. అయితే దళారులు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఆలయం బయట దేవాంగుల మండ పం సమీపంలోని వినాయకుని ఆలయం వద్ద భక్తులతో నేతిదీపాలు వెలిగింపజేస్తున్నారు. నేతిదీపాలు వెలిగిస్తే మంచిదంటూ వీటిని బలవంతంగా అంటగడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. నేతిదీపాలు వెలిగించాలని ఆగమ శాస్త్రాల్లో లేకున్నా దళారులు భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నేతిదీపాలు వెలిగిస్తున్న కారణంగా వినాయకుని ఆలయం పూర్తిగా మసిబారిపోయింది. స్వామి విగ్రహమూ కనిపించడం లేదు. చర్యలు తీసుకుంటాం ఆలయం లోపల నేతిదీపాలు వెలిగించడాన్ని పూర్తిగా రద్దు చేశాం. ఆలయం బయట వినాయకుని విగ్రహం వద్ద నేతిదీపాలు వెలిగించకుండా చర్యలు తీసుకుంటాం. -శ్రీరామచంద్రమూర్తి, శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో -
ముక్కంటీశా.. ఎన్నాళ్లీ అవస్థ..
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది శ్రీకాళహస్తి. ముక్కంటీశుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ కనీస సదుపాయాలు లేకపోవడం భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది. శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. విదేశాలకు చెందిన భక్తులు సైతం వస్తున్నారు. ఏడాదికి రూ.80 కోట్లకుపైగా ఆదాయం ఆలయానికి సమకూరుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వెంట లగేజీ ఉంటోంది. దీనిని అధికారులు ఆలయంలోకి అనుమతించడం లేదు. అదే సమయంలో ఆలయం తరపున సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో భక్తులు లగేజీ, సెల్ఫోన్లు, చెప్పులు భద్రపరుచుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. దీనికితోడు ఆలయ సమాచార కేంద్రం మూతపడడంతో భక్తుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలో దళారులు పనితనం చూపుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి నాలుగు ప్రవేశ గోపుర ద్వారాలు ఉన్నాయి. భక్తులు భిక్షాలగోపురం, శివయ్య గోపురం, తిరుమంజన గోపురం, దక్షిణ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. భిక్షాలగోపురం ప్రధానంగా బస్సుల్లో వచ్చే భక్తులు భిక్షాల గోపురం ద్వారా ఆలయం లోపలకు ప్రవేశిస్తుంటారు. చెప్పులను భద్రపరచుకోవాలంటే ఆ గోపురాన్ని దాటి బాలజ్ఞానాంబ గోపురం వద్దకు రావాలి. అక్కడ చెప్పులు పెట్టుకునే సదుపాయం ఉన్నట్లు యాత్రికులకు తెలియదు. ఎలాగైనా తెలుసుకుని వస్తే లగేజీ పెట్టుకోమని సిబ్బంది చెబుతారు. దీంతో భిక్షాల గోపురం వద్దనే కొందరు దుకాణదారుల వద్ద లగేజీ, చెప్పులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోవారు అవసరం లేని పూజా సామగ్రిని అంటగట్టి 300 నుంచి 350 రూపాయల వరకు పిండుకుంటున్నారు. భిక్షాలగోపురం ఒక్కచోటే ఆలయ సమాచార కేంద్రం ఉన్నప్పటికీ అందులో ఎవరూ విధులు నిర్వహించడం లేదు. వీరికి రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడ లేదు. దీంతో భక్తులు సమాచారం తెలుసుకోవాలంటే దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తిరుమంజన గోపురం ఈ గోపురం సన్నిధివీధిలోని జల వినాయకుడి ఆలయం వద్ద ఉంది. వాహనాల ద్వారా వచ్చే భక్తులు దాదాపుగా ఈ మార్గం గుండానే ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. ఈ గోపురం కింద నూతనంగా సెల్‌ఫోన్, లగేజీ పెట్టుకునే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మార్గంలో చెప్పులు పెట్టుకోవడానికి అవకాశం లేదు. దీంతో భక్తులు గోపురం ముందే చెప్పులను కుప్పలు కుప్పలుగా వదిలి వెళుతున్నారు. దర్శనం తర్వాత వచ్చేసరికి వారి చెప్పులు మాయమవుతున్నాయి. శివయ్య గోపురం లాడ్జీల్లో బస చేసిన భక్తులు, ఆటో వాళ్లు తీసుకొచ్చిన వారు ఈ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. ఇక్కడ లగేజీ, చెప్పులు భద్రపరుచుకునే సదుపాయం లేదు. దీంతో వ్యాపారుల వద్ద చెప్పులు, లగేజీ పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారు అడిగినంత సొమ్ము సమర్పించుకుంటున్నారు. దక్షిణ గోపురం ఈ గోపురం గుండా అత్యధికంగా భక్తులు ఆలయానికి వస్తుంటారు. ప్రధానంగా వీఐపీలు ఇదే మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ఈ గోపురం వద్ద సెల్‌ఫోన్ కౌంటర్ మాత్రమే ఉంది. లగేజీ, చెప్పులు పెట్టుకునే సదుపాయం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ చెప్పులు వదిలిపెట్టి వెళుతుంటారు. కొందరు సుపథ మండపంలోని స్తంభాల మధ్య వదిలి వెళుతున్నారు. తమ ఇబ్బందుల పట్ల ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం నాలుగు గోపుర మార్గాలను పరిశీలించి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. భిక్షాలగోపురం వద్ద, సమాచారం కేంద్రంలో సిబ్బంది పనిచేయని విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. -శ్రీరామచంద్రమూర్తి, ఆలయ ఈవో