
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విష్ణు. అయితే విడుదల తేదీ ఎప్పుడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. శివ భక్తుడైన కన్నప్ప కథతో ‘కన్నప్ప’ రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment