టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే ఈ రోజు కన్నప్ప నటుడు అక్షయ్ కుమార్ బర్త్ డే కావడంతో చిత్రబృందం విషెస్ తెలియజేసింది. ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చేతికి రుద్రాక్ష మాల ధరించిన ఫోటోను అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం లాంటి స్టార్స్ సైతం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది.
A Heartfelt Birthday wish to @akshaykumar! 🎉🙏 Your portrayal of Lord Shiva in this film is a testament to your unwavering dedication. Team #Kannappa🏹 celebrates you today and always.🌟 #HappyBirthdayAkshayKumar #HarHarMahadevॐ #TeamKannappa@themohanbabu @ivishnumanchu… pic.twitter.com/d6jqUpI8Z1
— Kannappa The Movie (@kannappamovie) September 9, 2024
Comments
Please login to add a commentAdd a comment