రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో..! | Ramgopal Varma to direct Vishnu Manchu | Sakshi
Sakshi News home page

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో..!

Published Fri, Dec 13 2013 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో..!

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో..!

మోహన్‌బాబు-రామ్‌గోపాల్‌వర్మలది ఓ టిపికల్ కాంబినేషన్. అసలు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈమధ్య కాలంలో చాలా అరుదుగా సినిమాలు చేస్తున్న మోహన్‌బాబు, వర్మ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇందులో విష్ణు కూడా నటించబోతున్నారు. ఈ సినిమా పూజాకార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లోని సాయిబాబా టెంపుల్‌లో జరిగాయి. విష్ణుతో వర్మ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఈ ప్రాజెక్ట్ మొదలుకావడం విశేషం. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ సంస్థ నిర్మించనుంది. జనవరిలో చిత్రీకరణ మొదలు కానుంది. గతంలో హిందీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతో ‘సర్కార్’ తీసిన వర్మ, మరి ఈ తండ్రీ కొడుకులతో ఏ తరహా సినిమా చేస్తారనేది ఫిలిమ్‌నగర్‌లో చర్చనీయాంశమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement