తాతా మనవళ్ళ కథ | Erra Bassu's audio on Oct 31 | Sakshi
Sakshi News home page

తాతా మనవళ్ళ కథ

Published Wed, Oct 22 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

తాతా మనవళ్ళ కథ

తాతా మనవళ్ళ కథ

 ‘‘పల్లెటూళ్లో పుట్టి పెరిగి నిరక్షరాస్యుడైన ఓ తాత, అమెరికాలో స్థిరపడాలని ఆరాటపడే ఓ మనవడి మధ్య జరిగే కథ ఇది. నాకు, విష్ణుకి ఈ కథ బాగుంటుందనిపించి ఈ చిత్రం చేస్తున్నాం’’ అని దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు చెప్పారు. తారక ప్రభు ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో దాసరి రూపొందిస్తున్న చిత్రం ‘ఎర్రబస్సు’. తమిళ చిత్రం ‘మంజ ప్పై’కి ఇది రీమేక్. బుధవారం హైదరాబాద్‌లో దాసరి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘ఈ సంస్థలో ఇది 33వ సినిమా. ఈ నెల 31న పాటలను, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 
 ఇది గొప్ప సినిమా అని విష్ణు అన్నారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు చక్రి,  రేలంగి నరసింహారావు, రచయిత రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.వ్యక్తిగతంగా ఎవర్నీ అనలేదు: ఈ మధ్య ఓ సమావేశంలో తాను మాట్లాడిన మాటలను ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరు వక్రీకరించారని దాసరి చెబుతూ ‘‘పరిశ్రమ మేలుకోరే వ్యక్తిగా పరిశ్రమ గురించి మాట్లాడతాను తప్ప, ఎవర్నీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. సునీల్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశానని చెప్పుకుంటున్నారు. నా మాటల్లోని మంచిని తీసుకోవాలని, వక్రీకరించవద్దని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement