రయ్.. రయ్‌మంటూ... | Dasari Narayana Rao's 151 film Erra Bassu | Sakshi
Sakshi News home page

రయ్.. రయ్‌మంటూ...

Published Sun, Nov 9 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

రయ్.. రయ్‌మంటూ...

రయ్.. రయ్‌మంటూ...

 దాసరి ఏ సినిమా చేసినా... తొలి ప్రాధాన్యత కథకే. ఇప్పటికి 150 చిత్రాలను వెండితెరకు అందించిన ఈ దర్శక దిగ్గజం... 151వ ప్రయత్నంగా రీమేక్‌ని ఎంచుకోవడం విశేషం. తమిళంలో ఘనవిజయాన్ని అందుకున్న ‘మంజా పై’ చిత్రం ఆధారంగా ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని రయ్ రయ్ మంటూ  రెడీ చేశారు దాసరి. పేరులోనే భిన్నత్వాన్ని ప్రదర్శించిన ఆయన... సినిమా పరంగా ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసుకోవాలంటే... ఈ నెల 14 దాకా ఆగాల్సిందే. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘యు’ సర్టిఫికెట్ లభించింది.
 
 దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో యు సర్టిఫికెట్ అందుకున్న 90వ చిత్రం ఇది. ఇందులో దాసరి, మంచు విష్ణు తాతామనవళ్లుగా నటించారు. తాతకు హైదరాబాద్ అంతా తిప్పి చూపించాలని ఆశించే మనవడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది ఈ చిత్ర కథాంశం. కేథరిన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కృష్ణుడు, రఘుబాబు, బేబీ నిరాజిత ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: అంజి, నిర్మాణం: తారకప్రభు ఫిలింస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement