'రౌడీ' నన్ను పూర్తిగా మార్చేశాడు: విష్ణు | 'Rowdy' has changed me as an actor: Vishnu Manchu | Sakshi
Sakshi News home page

'రౌడీ' నన్ను పూర్తిగా మార్చేశాడు: విష్ణు

Published Tue, Apr 1 2014 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

'రౌడీ' నన్ను పూర్తిగా మార్చేశాడు: విష్ణు

'రౌడీ' నన్ను పూర్తిగా మార్చేశాడు: విష్ణు

చెన్నై: 'రౌడీ' చిత్రం పూర్తి స్థాయి నటుడిగా మార్చిందని టాలీవుడ్ నటుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల కాలంలో ఓ మోస్తారు విజయాలను తన ఖాతాలో వేసుకున్న విష్ణు.. తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'రౌడీ' చిత్రంలో తండ్రి మోహన్ బాబుతో కలిసి నటిస్తున్నారు. 
 
'చాలా కాలం తర్వాత కామెడీ లేకుండా ఓ సీరియస్ చిత్రంలో నటించాను.  పూర్తి స్థాయి నటుడిననే సంతృప్తి కలిగించింది. కమర్షియల్ హంగులతోపాటు ఈ చిత్రంలో ఉద్వేగానికి గురి చేసే సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో నాలో ఉన్న నటుడిని రాము వెలికి తీశారు' అని విష్ణు తెలిపారు. 
 
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిన 'రౌడీ' చిత్రంలో మోహన్ బాబు, జయసుధ, శాన్వీ శ్రీవాస్తవ్, వెన్నెల కిషోర్, రవి బాబు తదితరులు నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 4 తేదిన విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement