Viranica Manchu's Maison AVA Creative Revolution In Kids Fashion
Sakshi News home page

Viranica Manchu: విరానిక మంచు.. అద్భుతమైన డిజైన్లు.. పిల్లల కోసం ప్రత్యేకంగా..

Published Sat, Nov 27 2021 5:02 PM | Last Updated on Sun, Nov 28 2021 3:18 PM

Viranica Manchu - Sakshi

Viranica Manchu Maison AVA Creative Revolution In Kids Fashion: ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విరానిక మంచు. యెడుగూరి సందింటి వారి ఆడపడుచు.. మంచు వారి కోడలు అయిన ఆమెకు ఫ్యాషన్‌ రంగంలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. భిన్న రకాల డిజైన్లతో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. విరానికను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే వారికి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేడుక ఏదైనా సరే... భర్త విష్ణుతో పాటు పిల్లలు అరియానా, వివియానా, అవ్రమ్ భక్త‌, ఐరాతో కలిసి అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌లో తళుక్కుమనాల్సిందే. 

పిల్లల కోసం పిల్లల పేరు మీదుగా..
విరానిక మంచు గతేడాది ఆగష్టులో మైసన్‌ అవా పేరు మీదుగా క్లాతింగ్‌ లేబుల్‌ను ప్రారంభించారు. తన కూతుళ్లు అరియానా, వివియానా, ఐరా పేర్లు కలిసి వచ్చేలా అవా(AVA) బ్రాండ్‌తో పిల్లలకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేయిస్తున్నారు. చేనేతతో రూపుదిద్దుకుంటున్న ఈ వస్త్రాలు.. సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా
విరానికా క్రియేటివ్‌ హెడ్‌గా వ్యవహరిస్తున్న అవా బ్రాండ్‌ సినీ ప్రముఖుల మనసు దోచుకుంటోంది. ఇప్పటికే అనేక మంది ప్రశంసలు అందుకున్న ఈ క్లాతింగ్‌ లేబుల్‌.. ఇటీవల ఆరాధ్య ధరించిన డ్రెస్‌తో మరోసారి చర్చనీయాంశమైంది. అవును.. మేము చెబుతుంది బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ముద్దుల మనుమరాలు, మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్వర్యారాయ్‌- హీరో అభిషేక్‌ బచ్చన్‌ గారాల పట్టి ఆరాధ్య బచ్చన్‌ గురించే!

ఆరాధ్య ఇటీవలే పదో వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా ఐశ్‌ దంపతులు మైసన్‌ అవా బ్రాండ్‌ తయారు చేసిన ‘ఫ్లోరెంటీనా’ డ్రెస్‌ను ఆరాధ్య కోసం ఎంపిక చేశారు. పుట్టినరోజు వేడుకలో ఈ స్టార్‌ కిడ్‌ అద్భుతమైన గౌన్‌లో మెరిసిపోయింది. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన సిల్క్‌ ఆర్గంజా పూలు, బీడ్స్‌ మేళవింపుతో ఈ డ్రెస్‌ను డిజైన్‌ చేశారు.

  

అమెరికన్‌ మీడియా పర్సనాలిటీ పారిస్‌ హిల్టన్‌ సైతం తన వివాహనంతరం నిర్వహించిన నియాన్‌ కార్నివాల్‌లో మైసన్‌ అవా బ్రాండ్‌ రూపొందించిన వీల్‌(తలపై ధరించే వస్త్రం) ధరించడం విశేషం. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకకు హిల్టన్‌ అవా నుంచి వీల్‌ను ఆర్డర్‌ చేయడం గమనార్హం.

నా భర్త, పిల్లల నుంచి స్ఫూర్తి పొంది
ఈ విషయాల గురించి విరానిక మంచు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ...‘‘నా నలుగురు పిల్లలను దృష్టిలో పెట్టుకుని అందరిలోనూ చిన్నారులు మరింత ప్రత్యేకంగా కనబడాలనే తపనతో దుస్తులను డిజైన్‌ చేశాను. ఒక్కో డ్రెస్‌ తయారు చేయడానికి వందల గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. ప్రతీ డ్రెస్‌ దేనికదే ప్రత్యేకం’’ అని బ్రాండ్‌ నెలకొల్పాన్న ఆలోచన రావడానికి గల కారణాలు వెల్లడించారు.

అదే విధంగా... తన భర్త, సినీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్త మంచు విష్ణు నుంచి స్ఫూర్తి పొందానన్న విరానిక.. సరికొత్త డిజైన్లు రూపొందిస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. కాగా విరానిక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడి కుమార్తె, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి(కజిన్‌) అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్‌ మార్కెటింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.


చదవండి: Thangka Print: మగువల మనసు దోచుకుంటున్న ‘తంగ్కా’ డిజైన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement