Manchu Vishnu's 'Ginna' Movie OTT Release Date Confirmed! - Sakshi
Sakshi News home page

Ginna Movie: ఓటీటీలోకి జిన్నా, స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

Published Thu, Dec 1 2022 5:45 PM | Last Updated on Thu, Dec 1 2022 11:36 PM

Manchu Vishnu Ginna Movie OTT Release Date Confirmed - Sakshi

అక్టోబర్‌ 21న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. అమెజాన్‌ ప్రైమ్‌లో

మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం జిన్నా. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్‌, చమ్మక్‌ చంద్ర ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్‌ 21న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. అమెజాన్‌ ప్రైమ్‌లో రేపటి(డిసెంబర్‌ 2) నుంచి ప్రసారం కానుంది. తెలుగు, మలయాళ భాషల్లో జిన్నా అందుబాటులోకి రానుందంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

సినిమా కథ విషయానికి వస్తే జిన్నాలో హీరో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. షార్ట్‌కట్‌గా జిన్నా అని పిలుచుకుంటారు. హీరో అప్పు చేసి టెంట్‌ హౌస్‌ పెట్టుకుంటాడు. ఏ పెళ్లికి టెంట్‌ వేసినా ఆ పెళ్లి ఆగిపోతుంది. అలాంటప్పుడు జిన్నా తన అప్పు ఎలా తీర్చాడనేదే కథ.

చదవండి: కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాక్‌లో హౌస్‌మేట్స్‌
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్‌ కౌర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement