కన్నప్ప గురి  | Vishnu Manchu Stars As Bhakta Kannappa In This Actioner, Kannappa First Look Poster Goes Viral - Sakshi
Sakshi News home page

Kannappa First Look Poster: కన్నప్ప గురి 

Published Sat, Mar 9 2024 3:38 AM | Last Updated on Sat, Mar 9 2024 11:10 AM

Kannappa first look: Vishnu Manchu stars as Bhakta Kannappa in this actioner - Sakshi

విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కన్నప్ప‘ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు మంచు లుక్‌ విడుదలైంది. ‘‘ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నారు విష్ణు మంచు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కన్నప్ప క్యారెక్టర్‌లోని డెప్త్, ఇంటెన్సిటీ చూపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ మూవీ రూపొందుతుండగా అన్ని భాషల్లో రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం రెండో షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement