దూసుకెళ్తాలో అన్నీ హైలైట్సే! | Doosukeltha is a Telugu comedy action movie acted by Manchu Vishnu | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తాలో అన్నీ హైలైట్సే!

Published Mon, Aug 19 2013 1:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM

దూసుకెళ్తాలో అన్నీ హైలైట్సే!

దూసుకెళ్తాలో అన్నీ హైలైట్సే!

‘‘మా సినిమా చాలా బాగా వస్తోంది. ఆ సంకేతాలు లొకేషన్‌లో కనిపిస్తున్నాయి. ఒక విజయవంతమైన సినిమాని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నామనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు విష్ణు. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్‌బాబు నిర్మిస్తున్న చిత్రం ‘దూసుకెళ్తా’. విష్ణు, లావణ్య జంటగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. 
 
 ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్యాచ్‌వర్క్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రకథను వీరు అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. కథ, పాటలు, ఫైట్లు, సన్నివేశాలు.. అన్నీ హైలైట్‌గా ఉంటాయి. ఈ నెలాఖరున టీజర్‌ను, వచ్చే నెల పాటలను, అక్టోబర్ మొదటి వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. 
 
 దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇందులో విష్ణు కొత్త లుక్‌లో కనిపిస్తారు. విష్ణు, లావణ్య మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ జంట బాగుందని అందరూ అంటున్నారు. అలాగే టైటిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. 
 
 బ్రహ్మానందం, ఆహుతిప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement