కేరళలో 'సర్వ కళా వల్లవన్'గా 'దూసుకెళ్తా'
కేరళలో 'సర్వ కళా వల్లవన్'గా 'దూసుకెళ్తా'
Published Mon, Nov 4 2013 3:34 PM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
మలయాళ ప్రేక్షకులకు మరోసారి దగ్గరైనందుకు చాలా సంతోషంగా ఉంది అని మంచు విష్ణు అన్నారు. గత సంవత్సరం విడుదలైన 'ఎదునమ్ రెఢి' చిత్రాన్ని కేరళ సినీ ప్రేక్షకుల చక్కగా ఆదరించారని ఆయన అన్నారు. తాజాగా మంచు విష్ణు నటించిన దూసుకెళ్తా చిత్రం 'సర్వ కళా వల్లవన్' పేరుతో మలయాళంలోకి అనువదించి శుక్రవారం కేరళ రాష్ట్రంలో విడుదల చేశారు.
30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'దూసుకెళ్తా' చిత్రానికి వీరు పోట్ల దర్శకత్వం వహించారు. 'దూసుకెళ్తా' చిత్రం అక్టోబర్ 17వ తేదిన విడుదలై తొలివారంలోనే 14.83 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
Advertisement
Advertisement