యూఎస్ లో 'రౌడీ' గ్రాండ్ ఎంట్రీ!
యూఎస్ లో 'రౌడీ' గ్రాండ్ ఎంట్రీ!
Published Thu, Apr 3 2014 3:12 PM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
యూఎస్ లో 'రౌడీ' గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాంగోపాల్ వర్మ, మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్ లో గురువారం విడుదల కానుంది. రౌడీ చిత్రం 50కు పైగా మల్టిప్లెక్స్ విడుదలయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టికెట్ విలువ 10 డాలర్లుగా నిర్ణయించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. పది డాలర్లకే టాప్ మల్టిప్లెక్స్ లో ఈ చిత్రాన్ని చూడవచ్చని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, కనువిందు చేసే పాటలున్నాయని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రతినిధులు వెల్లడించారు. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రంలో జయసుధ, వెన్నెల కిషోర్, రవిబాబు, శాన్వీ శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషించారు.
Advertisement
Advertisement