కొబ్బరిబొండాం చికెన్‌ రైస్‌ తింటారా.. | Manchu Vishnu Cooked Chicken Rice In Coconut | Sakshi
Sakshi News home page

కొబ్బరిబొండాం చికెన్‌ రైస్‌ తింటారా..

Published Wed, Apr 15 2020 8:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

కరోనా  మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమై సెలబ్రిటీల్లో కొందరు వంటలతో బిజీగా ఉంటే,  మరికొందరు తమ ఆత్మీయులతో ఆనందంగా గడుపుతున్నారు. తాజాగా మంచు విష్ణు కొబ్బరిబొండాంతో చేసిన వినూత్న ప్రయోగాన్ని తన ట్విటర్‌ షేర్‌ చేశాడు. అది వర్కవుట్‌ అయిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. కొబ్బరిబొండాంలో చికెన్‌ రైస్‌ చేయడం తయారు చేయడం కాస్త వింతగా అనిపించింది. 

కొబ్బరి బొండాంలో చికెన్‌ రైస్ వండి తను అనుకున్నది సాధించానని విష్ణు తెలిపాడు. అయితే ఇప్పుడు తాను చేసిన ప్రయోగం అంతగా సక్సెస్‌ కాలేదని, లాక్‌డౌన్‌ పూర్తయ్యేలోపు కచ్చితంగా కొబ్బరిబొండాంలో చికెన్‌ రైస్‌ వండుతానని తెలిపాడు. అంతేగాక చివర్లో లాక్‌డౌన్‌ పుణ్యమా అని మంచి చెఫ్‌గా తయారు అయ్యానంటూ కామెంట్‌ షేర్‌ చేశాడు. మీకు కూడా విష్ణు లాగా చేయాలనుకుంటే వెంటనే కొబ్బరి బొండాం కొని చికెన్‌ రైస్‌ వండేయండి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement