దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,484 వద్దకు చేరింది. సెన్సెక్స్ 901 పాయింట్లు ఎగబాకి 80,378 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేరకు కొనుగోళ్లు జరిగినట్లయింది.
ఇటీవల వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒక అంచనాకు వస్తుండడంతో మార్కెట్లు పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, యూఎన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా దేశీయ సంబంధాలు మెరుగ్గానే ఉంటాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్‌లు నష్టాల్లో ముగిసాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కొంత స్పష్టత వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు.
ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!
సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫీసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment