ట్రంప్‌ మా నాన్న.. తెరపైకి పాక్‌ యువతి | Pakistan Girl Claims She is Daughter of US President Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మా నాన్న.. తెరపైకి పాక్‌ యువతి

Published Thu, Nov 7 2024 11:05 AM | Last Updated on Thu, Nov 7 2024 11:14 AM

Pakistan Girl Claims She is Daughter of US President Donald Trump

 ఇస్లామాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్‌ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్‌ ట్రంప్‌ నిజమైన కుమార్తెనని పేర్కొంది. అయితే ఈ వీడియో ప్రామాణికతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషువాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని తెలిపింది.
 

తన కూతురిని బాగా చూసుకోలే​కపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ  అంటుంటారని ఆమె పేర్కొంది. ఈ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో @pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

 

ఇది కూడా చదవండి: ‘డాన్‌ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement