ఉషని కాదు... కిరణ్‌ని...
ఉషని కాదు... కిరణ్‌ని...
Published Thu, Mar 12 2015 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
రెండు కాళ్లూ చచ్చుబడిపోయినా, ఆత్మబలంతో అంగవైకల్యాన్ని జయించడమే కాకుండా, సమాజంలోని అభాగ్యులెందరికో అండగా నిలిచి పొరుగు రాష్ట్రాల్లో సైతం అంగవికలుర హక్కుల కోసం పోరాడుతున్నారు కిరణ్ అలియాస్ ఉష. కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఓ సామాజిక కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులై దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఉష... ఇటీవలే తన స్వస్థలమైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామ శివారులోని హనుమాన్‌తండాకు వచ్చివెళ్లారు. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె (అతడి) మాటల్లోనే...
అబ్బు వెంకట్‌రెడ్డి, సాక్షి, నర్సంపేట
మా అమ్మనాన్నలది కూలి పని చేస్తేగానీ పూటగడవని పరిస్థితి. నాకు ఒక అక్క, తము్మడు, చెల్లి. ఊహ తెలియక ముందే నా రెండు కాళ్లూ పోలియో వచ్చి చచ్చుబడిపోయూయి.బడికి పోవాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఎవరో ఒకరు ఎత్తుకుని తీసుకెళ్లనిదే బయటికి కదల్లేను కదా. తొలిసారి నా ఎనిమిదవ యేట బడికి వెళ్లాను. అది కూడా నేను బడికి పోతానని ఏడిస్తే కానీ అమ్మానాన్నలు ఒప్పుకోలేదు. మా తండా పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు నా స్నేహితుల సహకారంతో కష్టపడుతూ వెళ్లి పాఠాలు నేర్చుకున్నా.
అమ్మ కన్నీళ్లే... నా పోరాటానికి ప్రేరణ
అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. వికలాంగుల సర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వం నుంచి లబ్ది చేకూరుతుందని అందరూ అంటే అమ్మ నన్ను ఎత్తుకుని, నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పొద్దంతా ఉన్నా సర్టిఫికెట్ ఇవ్వలేదు. జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో తీసుకోండని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లకుండా సాయుంత్రం నర్సంపేట నుండి వరంగల్‌కు నన్ను అవ్ము తీసుకెళ్లింది. అక్కడ అప్పటికే సమయుం అయిపోయిందని, ఇప్పట్లో ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో అక్కడి నుండి ఇంటికి వెళ్లి మరోరోజు వచ్చేందుకు బస్సు చార్జీలు లేక అమ్మ నన్ను తన ఒడిలో ఉంచుకుని ఆస్పత్రి ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై రాత్రంతా చలిలో ఒణుక్కుంటూ, తనకు దోమలు కుడుతున్నా తన కొంగును నాపై కప్పి నిద్రపోకుండా మేల్కొనే ఉంది. తెల్లవారిన తర్వాత అమ్మ మళ్లీ ఆస్పత్రిలోకి వెళ్లి ఎవరెవరినో బతిమిలాడినా వికలాంగ సర్టిఫికెట్ రాలేదు. ఇక సాధ్యం కాదని నన్ను ఎత్తుకుని, ఏడ్చుకుంటూ ఇంటిబాట పట్టింది. అప్పుడే అమ్మను అడిగాను... ‘‘ఎందుకవ్మూ సర్టిఫికెట్? మనకెందుకు ఇస్తారవ్మూ? అని. ‘గవర్నమెంటోళ్లు మనకు ఇవ్వాలని రూల్ ఉన్నా ఇత్తలేరు బిడ్డా’ అని అమ్మ చెప్పిన మాటలు నాకింకా గుర్తే. అప్పుడే ఎలాగైనా సర్టిఫికెట్ పొందాలని నాలో సంకల్పం కలిగింది. వారం రోజుల తర్వాత నర్సంపేటలో క్యాంపు పెట్టినప్పుడు నేను వెళ్లాను. అక్కడ కొన్ని సాకులతో అధికారులు తప్పించుకునేందుకు చూస్తే, ఎదిరించి ఎందుకు ఇవ్వరంటూ వాళ్ల ముందు కూర్చోని గట్టిగా అరిచాను. నా అరుపులకు విలేకరులు, విద్యార్థులు, మరికొంత మంది నా దగ్గరికొచ్చి ఏమైందని ప్రశ్నించారు. నాకు సర్టిఫికెట్ ఇవ్వడంలేదని, చెప్పి ఇప్పించాలని వేడుకున్నా. సాయుంత్రం లోగా వికలాంగ సర్టిఫికెట్ నా చేతిలోకి వచ్చింది! అప్పుడే అనుకున్నా... పోరాడితే న్యాయుం జరుగుతుందని. నాటి నుండీ... నేను నడవలేని స్థితిలో ఉన్నా... నలుగురికి సహాయుం చేయూలనే లక్ష్యంతో వరంగల్ జిల్లాలో ప్రజ్వల వికలాంగుల పోరాట సంక్షేమ సంఘాన్ని ఏర్పరచి 2000 మందికి వారి హక్కుల సాధన కోసం సహాయుకురాలిగా ఉద్యమాలు నిర్వహించాను. అదే స్పూర్తి నేటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది.
అమ్మాయినే పెళ్లి చేసుకున్నా
ఊళ్లో ప్రాథమిక విద్య అయ్యాక, ఇంటర్, డిగ్రీ నర్సంపేటలో పూర్తి చేసాను. ఆ సమయుంలో తోపుడు బండిపై ఎక్కడకు వెళ్లాలన్నా నా స్నేహితురాలి వల్లనే సాధ్యం అయింది. నేను ఆడపిల్లను అయినా, మగవారిలా కంఫర్ట్‌గా ఉండాలని నా వేషధారణ మార్చుకున్నాను. నన్ను అన్ని రకాలుగా అర్థం చేసుకుని, స్నేహితురాలిగా ఉన్న సాటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. నా ఆలోచనను నా స్నేహితురాలికి చెప్పాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంగీకారం తెలిపింది. 2008 మార్చి 9న తిరుపతికి వెళ్లి వివాహం చేసుకున్నాం. ఈ విషయుం అందరికీ తెలిసి ఇదేం పని అని ప్రశ్నించారు. చివరకు మా తల్లిదండ్రులు కూడా అంగీకరించలేదు. దాంతో కర్ణాటక వెళ్లిపోయాం. కలిసి జీవిస్తున్నాం. నేను పేరు మార్చుకున్నాను. ఉష అని కాకుండా, కిరణ్‌గా పిలిపించుకోవడమే నాకు ఇష్టం.
పోరు బాట... పరభాషను నేర్పింది
ప్రస్తుతం చిక్‌బళ్లాపూర్‌లో ఉంటున్నాం. తోటి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో 2009లో కర్ణాటక వికలాంగుల పోరాట సమితిని ప్రారంభించాను. తెలుగు భాష తప్ప ఇతర ఏ భాషా తెలియని నేను ఎలాగైనా కన్నడం నేర్చుకోవాలనుకున్నా. భాష రానిదే పోరుబాటలో నడవలేనని తెలుసుకుని కొద్ది కాలంలోనే కన్నడం నేర్చుకున్నాను.
ఇప్పటి వరకు మా సమితిలో 25 వేల మంది వికలాంగులు సభ్యులుగా చేరారు. వారికి ఎలాంటి సమస్య ఉన్నా ముందుకు నడిచి ఆందోళనలు చేపట్టాను. దీంతో అక్కడి ప్రభుత్వాలు కూడా మా పోరాట బలాన్ని చూసి మాకు గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం హిజ్రాల తరపున జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహిస్తూనే, కర్ణాటక ప్రభుత్వం తరఫున లింగత్వ అల్పసంఖ్యాకుల వేదికకు రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే కర్ణాటక ఎయిడ్స్ అవగాహన ప్రాజెక్ట్‌కు అయిదు జిల్లాల కోఆర్డినేటర్‌గా కూడా ఆ ప్రభుత్వం నాకు బాధ్యతలు అప్పగించింది. మున్ముందు నేను చేపట్టబోయే కార్యక్రమాలకు సొంత రాష్ట్రంలో కూడా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా.
Advertisement