ఆటల్లో రాణించేందుకు క్రీడాకారులు ఎంతో శ్రమిస్తుంటారు. ముఖ్యంగా ఫిట్ నెస్ కాపాడుకునేందుకు కఠినమైన కసరత్తులు చేస్తుంటారు. తమ పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దే క్రమంలో వారి తల్లిదండ్రులు కూడా ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. పిల్లల కోసం అవసరమైతే ఆటలు నేర్చుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ కోవలోకే చెందుతారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తల్లి ఉష. కూతురు కోసం ఆమె కఠినమైన కసరత్తులు చేస్తున్నారు.