మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలను దారుణంగా వేధిస్తున్నారని జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది. లేడీ ఆర్టిస్టులను అడ్జస్ట్‌మెంట్ అడుగుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి ఉష తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 1992లో మోహన్‌లాల్‌తో కలిసి సినిమా చేస్తున్న రోజులవి.. టీమ్ అంతా కలిసి బహ్రెయిన్ వెళ్లాం. అక్కడ ఓ షో పూర్తవగానే అందరం తిరుగుప్రయాణానికి రెడీ అయ్యాం.
లిఫ్ట్‌లో నాతో అసభ్యంగా..
మోహన్‌లాల్ మా సామాన్లు తెచ్చేసుకోమని చెప్పాడు. నేను గదిలోని నా సామాను సర్దేసుకుని లిఫ్ట్ ఎక్కాను. అప్పటికే అందులో ఓ సీనియర్ నటుడు ఉన్నాడు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే కోపంతో చెంప చెళ్లుమనిపించాను. మలయాళ చిత్రపరిశ్రమలో అందరూ ఎంతగానో అభిమానించే ఆ నటుడు ఇలా చీప్‌గా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ మాట మోహన్‌లాల్‌కు చెప్తే మంచి పని చేశావన్నాడు.
ఛాన్సులు తగ్గిపోయాయి..
కానీ అందరూ నాకు పొగరు అని ముద్ర వేశారు. ఈ సంఘటన తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడా పెద్ద మనిషి బతికి లేడు కాబట్టి తన పేరు చెప్పదల్చుకోలేదు. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారంటారేమో.. ఈ విషయం నేను గతంలో చెప్పాను. అందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుండటంతో మరోసారి చెప్తున్నాను అని ఉష పేర్కొంది.
చదవండి: ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ
Comments
Please login to add a commentAdd a comment