సాయి పూజిత, ఇతర విద్యార్థులతో ఆశాలత
గుంటూరు ఎడ్యుకేషన్: భాష్యం ఐఐటీ అకాడమీ ఫౌండేషన్‌లో 9వ తరగతి చదువుతున్న జి.సాయి పూజిత ఈనెల 30న అమెరికాలోని అంతరిక్ష పరిశోధ న సంస్థ (నాసా) సందర్శనకు వెళు తోందని భాష్యం లిటిల్ చాంప్స్ సీఈవో భాష్యం ఆశాలత తెలిపారు. గుంటూరులోని భాష్యం ప్రధాన కార్యాలయంలో శనివారం ఆమె విలేకరు లతో మాట్లాడారు. యూఎస్‌ఏలోని ఆస్ట్రానాట్ మెమోరియల్ ఫౌండే షన్, ఫ్లొరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గో ఫర్ గురు సంస్థ సంయుక్తంగా గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పేస్ సైన్స్ వ్యాసరచన పోటీలో దేశవ్యాప్తంగా 826 పాఠ శాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు.
ఈ పరీక్షల్లో అత్యంత ప్రతిభ చూపడం ద్వారా భారత్ నుంచి ముగ్గురు విద్యార్థులను నాసా ఎంపిక చేయగా, వారిలో ఒకరు సాయిపూజిత కావడం గర్వించదగిన విషయమన్నారు. నాసా వ్యోమగామి డాక్టర్ డాన్ ధామస్ చేతుల మీదుగా తమ విద్యార్థిని సాయి పూజిత నాసా సందర్శ నార్థం ఉచితంగా విమాన టికెట్ అందుకుందని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐదు అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించగా వాటిలో ‘అబ్దుల్ కలాం మై ఇన్‌స్పిరేషన్, మై హీరో’ అనే అంశంపై రాసిన వ్యాసానికి గానూ సాయిపూజిత అర్హత సాధించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment