స్కూల్‌ బస్సును ఢీకొన్న లారీ..! | lorry Hits Private School Bus In Warangal | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సును ఢీకొన్న లారీ..!

Published Tue, Sep 25 2018 10:49 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

lari Hits Private School Bus In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : ప్రైవేటు స్కూల్‌ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన ఘటన వరంగల్‌ జిల్లా వర్థన్నపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమింది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తున్న లారీ డ్రైవర్‌ ఎదురుగా వస్తున్న స్కూల్‌ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మంది విద్యార్థులు ఉన్నారు. లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. గాయాలపాలైన విద్యార్థులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలిస్తున్నారు. బస్సు డీసీ తండా నుంచి వర్ధన్నపేటలోని స్కూల్‌కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్కూల్‌ బస్సు బోల్తా..
ప్రకాశం : విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న ప్రైవేలు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలం కాటురిపాలెం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement